Share News

AP Politics: సొంత నియోజకవర్గంపై ఫోకస్.. అందరి దృష్టి ఆకర్షిస్తున్న పవన్..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:17 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు.

AP Politics: సొంత నియోజకవర్గంపై ఫోకస్.. అందరి దృష్టి ఆకర్షిస్తున్న పవన్..!
Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తన శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏదైనా పనిని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిచాలన్నా.. మొదట ఫైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో అమలుచేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. తన సొంత నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. సామాన్యుడు సమస్యలతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. సమస్యల రహిత నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మిగతా నియోజకవర్గాలతో పోల్చినప్పుడు ఎక్కువుగా జరుగుతాయి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారనే చర్చ సాగుతోంది.

CM Chandrababu: మళ్లీ నేనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతా...


స్పెషల్ గ్రీవెన్స్‌సెల్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల కోసం పవన్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ప్రతి అర్జీపై పరిశీలన చేసి.. వాస్తవమైన సమస్య అయితే తక్షణమే సంబంధిత విభాగానికి పంపించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. అర్జీ ఇచ్చిన తర్వాత సమస్యకు సంబంధించిన అప్‌డేట్స్‌ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. దీంతో పవన్ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా


అభివృద్ధిపై ఫోకస్..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గుర్తించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రయత్నిస్తున్నారట. నియోజకవర్గంలోని యువత కోసం ప్రత్యేక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Payyavula Kesav: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే నా తొలి బాధ్యత


దేశంలోనే ఆదర్శంగా..

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ప్రతి విషయంలో తన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అభివృద్ధి, ఉపాధి అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించేలా పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. రానున్న కాలంలో పిఠాపురంలో మరింత మార్పు తప్పకుండా చూస్తారని అక్కడి ప్రజలకు చెబుతున్నారు. నెలరోజుల పాలనలో పవన్ అదరగొడుతున్నారంటూ రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారు.


Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:17 PM