దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు విశేష కృషి
ABN , Publish Date - Oct 06 , 2024 | 12:00 AM
సర్పవరం జంక్షన్, అక్టోబరు 5: దివ్యాంగుల సామాజిక, సాంస్క్రతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బన్వారీ లాల్ వ
కేంద్ర మంత్రి బన్వారీ లాల్ వర్మ
సర్పవరం జంక్షన్, అక్టోబరు 5: దివ్యాంగుల సామాజిక, సాంస్క్రతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బన్వారీ లాల్ వర్మ తెలిపారు. శనివారం కాకినాడ ఒకటో డివిజన్ సురేష్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక అధికారిత శివర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాసు, కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ, వనమాడి కొండబాబులతో కలసి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో సుగమ్య భారత్ అభియాన్ కింద 38 భవనాల నిర్మాణం కోసం రూ.14.36 కోట్లు విడుదల చేశామన్నారు. 6,904 దివ్యాంగులకు రూ.45.04 కోట్లు స్కాలర్‌షిప్స్‌లు మంజూరు చేశామన్నారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 2878 మందికి ఉచితంగా ఉపకరణలు పంపిణీ చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 1891 మందికి రూ.3.19 కోట్ల విలువైన 14 రకాలకు చెందిన 2878 ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని జేసీ రాహుల్‌మీనా తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, డిజెబుల్ వెల్పేర్ ఇన్‌చార్జి ఏడీ పి.నారాయణమూర్తి, సెట్రాజ్ సీఈవో కాశీవిశ్వేశ్వరరావు, ఎంపీడీవో కర్రె స్వప్న, కూటమి నాయకులు పెంకే శ్రీనివాస బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.