Share News

మాధవపట్నంలో వీధి కుక్కలపై విషప్రయోగం!

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:00 AM

సామర్లకోట, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌ నుంచి రెండవ సచివాలయం వెళ్లే రోడ్డు కాలనీ ప్రాంతంలో గత 2రోజులుగా వీధి కుక్కలపై విషప్రయోగం కారణంగా వరుసగా కుక్కలు మృత్యుబాట ప డ్డాయని కాలనీవాసులు ఆందోళన చెందుతు న్నారు. ఈ

మాధవపట్నంలో వీధి కుక్కలపై విషప్రయోగం!

పది కుక్కలు మృతి

సామర్లకోట, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌ నుంచి రెండవ సచివాలయం వెళ్లే రోడ్డు కాలనీ ప్రాంతంలో గత 2రోజులుగా వీధి కుక్కలపై విషప్రయోగం కారణంగా వరుసగా కుక్కలు మృత్యుబాట ప డ్డాయని కాలనీవాసులు ఆందోళన చెందుతు న్నారు. ఈ ప్రభావం తమ ఇళ్ళల్లో పెంచుకునే మేలు జాతి కుక్కలపై పడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. మృత్యుబాట పట్టిన వీధి కుక్కలలో కొన్ని కుక్కలు గర్భం దాల్చిఉన్నట్లు తెలిపారు. పంచాయతీ అధికారులు సత్వరం స్పందించి వీధి కుక్కలపై విషప్రయోగం చేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాగా అదే ప్రాంతంలో మేకల శిబిరాలు నిర్వహిస్తున్నారని, వీధి కుక్కల బారి నుంచి మేకలను కాపాడుకునేందుకు మేకల పెంపకందారులే వీధి కుక్కలపై విషప్రయోగం చేశారన్న ఆరోపణలు కాలనీ వాసుల నుంచి వినవస్తున్నాయి. ఇదే విషయమై గ్రామ పం చాయతీ కార్యదర్శి సత్యనారాయణను వివరణ కోరగా సోమవారం సాయంత్రం నాటికి వీధి కుక్కలపై విషప్రయోగం సంఘటనకు చెంది ఎవరూ పంచాయతీకి ఫిర్యాదులు చేయలేదని, పంచాయతీ చెంతనే పశువుల ఆసుపత్రి సిబ్బ ంది నుంచి ఏ సమాచారం పంచాయతీకి అం దలేదని చెప్పారు. మంగళవారం సచివాలయ సిబ్బందిచే విచారణ చేయిస్తామని తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 01:00 AM