Share News

‘ఈవీ’ధంగా

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:22 AM

నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్‌ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.

‘ఈవీ’ధంగా

నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్‌ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.

రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో భారీగా వాహన కాలుష్యం

గాలిలో తగ్గుతున్న నాణ్యత.. 100 దాటుతున్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌

వాహనాల కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాలే పరిష్కారం

నగరాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఈవీల సంఖ్య

ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలపై పెరుగుతున్న ఆసక్తి

ఈ-బస్సులపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి.. ఇప్పటికే ప్రతిపాదనలు

కాలుష్యరహితం.. పర్యావరణహితం.. ఖర్చు మితం..

(రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)/ కార్పొరేషన్‌(కాకినాడ), ఆంధ్రజ్యోతి:

కాకినాడ జిల్లా పరిధిలో 20లక్షల92వేలమంది జనాభా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 18ల క్షల33వేలమంది జనాభా ఉన్నారు. వీటిలో కాకి నాడ,రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లుగా ఉన్నా యి. ఆస్పత్రులు, కళాశాలలు, పెద్దపెద్ద సంస్థలు వంటివన్నీ ఈ నగరాల్లోనే నెలకొల్పారు. దీంతో పరిసర ప్రాంతాల్లోని చాలామంది ఉద్యోగ, ఉపా ధి, వ్యాపార, చదువుల నిమిత్తం నగరాల్లోనే స్థిర పడుతున్నారు. దీనివల్ల ఇక్కడ జనాభా తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నగరాల్లో వాహనాల సంఖ్య భారీగా ఉంది. వాటి నుంచి వెలువడే కాలుష్యం ఈ నగరాలపై ప్రభా వం చూపిస్తోంది. దీని నియంత్రణకు గాను మొ క్కలు విరివిగా పెంచాల్సి ఉంది. నగరమంతా ప చ్చదనం కనిపించాలి. తద్వారా ప్రజలకు స్వచ్ఛ మైన గాలి పీల్చే అవకాశం ఉంటుంది. కానీ, కాకి నాడ, రాజమహేంద్రవరం నగరాల్లో మొక్కల పెంపకం ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో లేదు. దీనివల్ల కాలుష్యం పెరిగినప్పుడల్లా గాలిలో నా ణ్యత తగ్గుతోంది. ఈ గాలి పీల్చడం ద్వారా ప్ర జలకు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో వాహనాల నుంచి వెలువడే కార్బన ఉద్గారాల సమస్యను పరిష్కరించేందుకు ఎలక్ర్టిక ల్‌ వెహికల్స్‌ను పెంచాలన్న వాదన ఉంది. ఇందు లో భాగంగా మొదటి అడుగుగా నగరపాలక సం స్థల పరిధిలో చెత్తసేకరణకు ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌ వాహనాలనే వినియోగిస్తున్నారు. ప్రజ ల్లోను ఈవీల వినియోగంపై ఆసక్తి కలుగుతోంది.

ఆర్టీసీలో 150 ఈవీలకు ప్రతిపాదనలు

కాకినాడ, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోల్లో కూడా ఎలక్ట్రికల్‌ బస్సులకు ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. కాకినాడ జిల్లాలో ఆర్టీసీకి ప్రస్తుతం 25 బీఎస్‌6 బస్సులు వచ్చాయి. వీటిలో 21 బస్సులు సూపర్‌లగ్జరీ, 4 బస్సులు స్లీపర్‌ కోచ్‌లు ఉన్నాయి. ఇవీ పర్యావరణహితంగా ఉంటాయని ఆ ర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా కాకినాడ ఆర్టీసీ డిపోకి 50, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకి 100 చొప్పున ఈవీ బస్సులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి ఒక్కో బస్సు రూ.1.50 కోట్లకు కలిపి మొత్తం రూ.225కోట్లతో కొనుగోలు కు ఆర్టీసీ సిద్ధమవుతోంది. వీటిని ఉమ్మడి జిల్లా పరిధిలో తిప్పేలా ప్రణాళిక సిద్ధం చేసిన అధికా రులు వీటి నిమిత్తం మొత్తం 25చోట్ల చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తు తం ఆర్టీసీలో హైదరాబాద్‌, విజయవాడనుంచి రాజమహేంద్రవరం మీదుగా కొన్ని ఎలక్ర్టికల్‌ బస్సులు తిరుగుతున్నాయి.

కంటికి కనిపించని శత్రువు

స్విట్జర్లాండ్‌కి చెందిన ఓ సంస్థ అధ్యయనంలో అత్యంత కాలుష్యభరిత దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మన దేశంతో సహా చాలా దేశాలు ఎకో ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నాయి. దీనిలోభాగంగా వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రత్యామ్నాయంగా భావి స్తున్నారు. వాయుకాలుష్యానికి ఏటా ప్రపంచవ్యా ప్తంగా 80లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి. పెట్రోవాహనాలు, ఫ్యాక్టరీలు విడుదల చేసే పొగ లోని సూక్ష్మధూళి, రసాయన కణాలు,కర్బన ఉద్గా రాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండెపోటుకు కార ణమవుతూ ప్రాణాలను కబళిస్తున్నాయి. పిల్లల్లో శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం నాశ నం చేస్తోంది. పిల్లల్లో న్యూమోనియా కేసుల సం ఖ్య పెరగడం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే పెట్రో వాహనాల కొనుగోళ్లపై హిమాచల్‌ ప్రభు త్వం ఆంక్షలు విధించింది. ఈనిర్ణయం ఈవీల కొ నుగోలుకు ఊతంగా మారి గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ లక్ష్య సాధనకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఈ-బైక్‌లు, ఈకార్లు

ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంల్లో ఈ-బైక్‌లు విక్రయించే షోరూంలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మూడు జిల్లాలో నెలకు కనీసం 50 వరకూ ఇవి రోడ్డెక్కుతున్నాయి. ఈ-బైక్‌లు రూ.50వేలు మొదలుకొని రూ.2లక్షల వరకూ వివిధ శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈవీ కార్లను ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలు ఇప్పటికే మార్కెట్‌లోకి దింపాయి. వీటి ధరలు భారీగానే ఉంటున్నాయి. దీంతో సంపన్న వర్గాలు మాత్రమే వీటిపై దృష్టిపెట్టాయి.

ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాం తాల్లో గాలిలో నాణ్యత ఆయా సమయాలను బట్టి మారుతోంది. ఆదివారం, ఇతర సెలవురోజు ల్లో వాహనాల ప్రయాణం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు సాధారణ స్థితి ఉంటోంది. ఇతర రోజు ల్లో ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల గాలిలో నాణ్యత తగ్గి ఒక్కోసారి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తా జాగా నిర్వహించిన ఏక్యూఐ పరీక్షల్లో కాకినాడలో ఓ సందర్భం లో అత్యధికంగా 108 ఉందని తేలింది. రాజమహేంద్రవరంలో కూడా ఓ సందర్భంలో అత్యధికంగా 115 వరకూ ఉందని నిర్ధారణైంది. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉం టుంది. రెండుచోట్ల ఆదివారం 50 లోపే ఉంది.


ఉమ్మడి జిల్లాలో చార్జింగ్‌ స్టేషన్లు

ఈవీలకు చార్జింగ్‌ స్టేషన్లు పెరగాల్సి ఉంది. ప్రస్తుతం వినియోగదారులు ఈ-బైక్‌లు, ఈ-ఆటోలకు ఇళ్ల వద్దే చార్జింగ్‌ పెట్టుకుంటున్నారు. వీటికి కనీసం నాలుగైదు గంటలపైనే సమయం పడుతోంది. ఎథర్‌, టాటా, రెన్‌ వంటి మోటారు కంపెనీలు తమ సర్వీస్‌ సెంటర్ల వద్ద చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాయి. వీటివద్ద బైక్‌లు, ఆటోలు, కార్లకు చార్జింగ్‌ పెట్టుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతం కాకినాడ, రాజమహేంద్రవరంల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో తుని నుంచి రాజమహేంద్రవరం మధ్య నాలుగైదు చోట్ల పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాజానగరం దగ్గర్లో రెండు, గండేపల్లి మండలం మురారిలో ఒకటి, జగ్గంపేట మండలం జెడ్‌.రాగంపేటలో ఒకటి, తుని మండలం తేటగుంటలో ఒకటి ఉన్నాయి. హైవేపై ప్రయాణించే ఈవీ కార్లు, బస్సులకు ఈ స్టేషన్లవద్ద చార్జింగ్‌ పెడుతున్నారు.

నగరాల్లో ఈ-ఆటోల పరుగులు

ఎలక్ర్టికల్‌ విప్లవం మొదలు కావడంతో ఈవీ ఆటోలు కూడామార్కెట్‌లోకి వచ్చేశాయి.నాణ్యతను బట్టి రూ.1.5 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వివిధ ఽధరల్లో అందు బాటులో ఉంటున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాలతోపాటు అమలాపురం, రావుల పాలెం, మండపేట, సామర్లకోట, పిఠాపురం, తుని, కొ వ్వూరు పట్టణాల్లోను ఈ-ఆటోలు పరుగులు పెడుతు న్నాయి. వీటి మోడళ్లు కూడా కాస్త భిన్నంగా ఉండ డంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కాకినాడ స్మార్ట్‌సిటీలో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలనుంచి చెత్తను సేకరణకు ఇ-రిక్షా, ఇ-కార్ట్‌ వాహనాలను కొనుగోలు చేశారు. వీటికోసం కాకినాడలోని వివేకానంద పార్కువద్ద సర్వీస్‌ సెంటర్‌, బ్యాటరీ చార్జింగ్‌ కేంద్రాలను నిర్మించారు.

తగ్గుతున్న గాలి నాణ్యత..

పొల్యూషన్‌ బోర్డు ప్రతి వారం నిర్వహించే పరీక్షల్లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరా ల్లో గాలిలో నాణ్యత తగ్గుతోందని తేలింది. గాలి లో నాణ్యతను గుర్తించే ప్రక్రియను ఎయిర్‌ క్వా లిటీ ఇండక్స్‌(ఏక్యూఐ) అంటారు. గాలిలో ఉం డే పీఎంలు(పర్టిక్యులర్‌ మేటర్‌), నైట్రోజన్‌ డ యాక్సైడ్‌(ఎన్‌వో2), ఓజోన్‌(ఓ3), సల్ఫర్‌ డయా క్సైడ్‌(ఎస్‌వో2), కార్బన్‌ మోనోక్సైడ్‌ (సీవో)లను బట్టి ఈ ఏక్యూఐను నిర్ధారిస్తారు. వీటిలో పీఎం లు వాతావరణంలో కలిసిపోయి చిన్న కణాలు గా ఉంటాయి. మిగిలినవి వాయురూపంలోనే ఉంటాయి. ఈ ప్రమాదకర వాయువులన్నీ పరి శ్రమలు, వాహనాల కాలుష్యంనుంచే విడుదల వుతాయి. ఈ ఏక్యూఐ ఎక్కువగా ఉంటే గాలిలో నాణ్యత తగ్గుతున్నట్టు లెక్క. 50లోపు ఉంటేనే శ్రేయస్కరం. 100లోపు ఉంటే అంతంతమాత్రం. 100 దాటితే ఆందోళనకరం.

ఈవీ వాహనాల వాడకం పెరుగుతోంది..

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ అయిన ఈ వాహనాలు

ఆర్టీవో పరిధి ఎలక్ట్రిక్‌ ప్యూర్‌ స్ట్రాంగ్‌

(బీవోవీ) ఈవీ హైబ్రిడ్‌ఈవీ

రాజమహేంద్రవరం 1015 380 23

కాకినాడ 1295 373 22

అమలాపురం 217 76 5

మండపేట 201 47 4

కత్తిపూడి 165 37 3

రంపచోడవరం 31 5 0

Updated Date - Oct 21 , 2024 | 01:23 AM