విజయవాడ వరద బాధితులకు అండగా..
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:11 AM
జగ్గంపేట, సెప్టెంబరు 3: విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యో తుల నెహ్రూ ఫౌండేషన్ 40వేల బిర్యానీ ప్యాకెట్స్, లక్ష వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేసేందుకు మంగళ వారం జగ్గంపేట టీడీపీ కార్యాలయం నుంచి వాహనంలో నాయకులు, కార్యకర్తలు తీసుకునివెళ్లారు. ఈ వాహనాన్ని ఎమ్మె
ఆహార పదార్థాల తరలింపు
జగ్గంపేట, సెప్టెంబరు 3: విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యో తుల నెహ్రూ ఫౌండేషన్ 40వేల బిర్యానీ ప్యాకెట్స్, లక్ష వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేసేందుకు మంగళ వారం జగ్గంపేట టీడీపీ కార్యాలయం నుంచి వాహనంలో నాయకులు, కార్యకర్తలు తీసుకునివెళ్లారు. ఈ వాహనాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించి వాహనంతో పాటు విజయవాడ బయల్దేరి వెళ్లా రు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుని రూరల్: విజయవాడ ప్రజానీకానికి మేము సైతం లోవ తలపులమ్మ లోవ దేవస్థానం నుంచి పులిహార ప్యాకెట్లు, తుని మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిత్యావసర సరుకులు తరలించారు.
కిర్లంపూడి: కిర్లంపూడి టీడీపీ మండలాధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు విజయవాడ వెళా ్లరు.తూము కుమార్, కుర్ల చినబాబు, కాళ్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకటశివ, ఎడ్ల మురళీకృష్ణ, ఆళ్ల నానాజీ, శ్రీమన్నారాయణ, శివ ఉన్నారు.
పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించిన కొండబాబు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 3: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ వెళ్లిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం పున రావాస కార్యక్రమాలు పర్యవేక్షించారు. విజయవాడ లో వరద ముంపునకు గురైన ముస్తఫారోడ్డు, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో స్థానికులకు పునరావాస కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, మందులు, ఆహార సరఫరాను పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
విజయవాడకు వెళ్లిన పారిశుధ్య సిబ్బంది
పిఠాపురం, సెప్టెంబరు 3: విజయవాడలో భారీ వరదల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల నేపధ్యంలో ఇతర జిల్లాల నుంచి పారిశుధ్య సిబ్బందిని పంపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం ము న్సిపాలిటీకి చెందిన 20మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇనస్పెక్టర్, ఇద్దరు శానిటరీ మేస్త్రీలు, ఇద్దరు వార్డు శానిటేషన్ సెక్రటరీలను విజయవాడలో విధుల నిర్వహణకు నియమించారు. వారిని మంగళవారం విజయవాడ పంపినట్టు పిఠాపురం మున్సిపల్ కమిషనరు కనకారావు తెలిపారు.