కాస్త ఫీలింగ్!
ABN , Publish Date - Oct 01 , 2024 | 01:11 AM
కా..ఫీ.. అంటే కాస్త ఫీలింగ్. ఉదయాన్నే పొగలు కక్కే చిక్కటి కాఫీ రుచి చూడనిదే చాలామందికి రోజు ఆరంభమేకాదు. కాఫీ గొంతులో పడనిదే మంచం దిగని వారెందరో. ఇదేంటి పొద్దున్నే అన్నామనుకోండి.. బెడ్ కాఫీ మహిమ మీకేం తెలుసంటారు. రీఫ్రెష్ అవ్వాలంటే కాఫీ ఒక్కటే మందు అని వాదించే కాఫీ క్లబ్ బ్యాచ్‌లూ ఉన్నాయి. ఇదివరకు కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఒక్కటే. అంత సమయం లేదండీ.. అనుకునే వాళ్లంతా ఇన్‌స్టెంట్ కాఫీ రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ కాఫీలు ఓల్డ్. ట్రెండ్‌కు అనుగుణంగా కాఫీ రకాలెన్నో వచ్చేశాయి. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, చాక్లెట్ కాఫీ.. ఇంకా చాలా ఉన్నాయ్. ఓసారి కాఫీడేకో, మరో కాఫీషాప్‌కో వెళితే ఇవన్నీ కాఫీలేనా అని ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.. నేడు కాఫీ డే సందర్భంగా ఒక్కసారి ఆ కాఫీ రుచి చూసేద్దాం.. కాస్త.. ఫీలింగ్ ఆస్వాదిద్దాం!
నేడు ఇంటర్నేషనల్ కాఫీ డే
కొత్త కొత్త రకాల్లో కాఫీ
కాఫీ సాగు కేరాఫ్ మన్యం
కా..ఫీ.. అంటే కాస్త ఫీలింగ్. ఉదయాన్నే పొగలు కక్కే చిక్కటి కాఫీ రుచి చూడనిదే చాలామందికి రోజు ఆరంభమేకాదు. కాఫీ గొంతులో పడనిదే మంచం దిగని వారెందరో. ఇదేంటి పొద్దున్నే అన్నామనుకోండి.. బెడ్ కాఫీ మహిమ మీకేం తెలుసంటారు. రీఫ్రెష్ అవ్వాలంటే కాఫీ ఒక్కటే మందు అని వాదించే కాఫీ క్లబ్ బ్యాచ్‌లూ ఉన్నాయి. ఇదివరకు కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఒక్కటే. అంత సమయం లేదండీ.. అనుకునే వాళ్లంతా ఇన్‌స్టెంట్ కాఫీ రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ కాఫీలు ఓల్డ్. ట్రెండ్‌కు అనుగుణంగా కాఫీ రకాలెన్నో వచ్చేశాయి. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, చాక్లెట్ కాఫీ.. ఇంకా చాలా ఉన్నాయ్. ఓసారి కాఫీడేకో, మరో కాఫీషాప్‌కో వెళితే ఇవన్నీ కాఫీలేనా అని ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.. నేడు కాఫీ డే సందర్భంగా ఒక్కసారి ఆ కాఫీ రుచి చూసేద్దాం.. కాస్త.. ఫీలింగ్ ఆస్వాదిద్దాం!
కాఫీ.. ఉషోదయాన ఉత్తేజం కలిగించే గమ్మత్తైన పానీయం. కాఫీ.. అనే రెండక్షరాల పదం వినగానే ప్రాణం లేసొచ్చిందనే నానుడి వింటూనే ఉంటాం. ఇష్టాయిష్టాలు చాలామందివి కలుస్తూ ఉండొచ్చుగానీ, కాఫీప్రియులకు పెద్ద గా పరిచయాలతో పనిలేదు. ఎవరినైనా ము చ్చట్లలో ముంచెత్తేంతగా దగ్గర చేసేది కాఫీ మాత్రమే. అందుకే కాఫీ కబుర్లు అని దానికో నిక్‌నేమ్ పెడుతుంటారు. పెద్ద పెద్ద చర్చలు కూడా కాఫీ టేబుల్ దగ్గరే జరుగుతుంటాయ నీ వింటుంటాం. కాఫీ చెట్ల నుంచి లభించే గిం జలను శుద్ధి చేసి ఎండబెట్టి, పొడి చేసి కాఫీ తయారీకి వినియోగిస్తారని తెలిసిందే. అనేక దేశాల్లో కాఫీ పంటను సాగుచేస్తుండగా, మన మన్యంలో కూడా కాఫీ సాగు ఎప్పుడో మొద లైంది. 1898లో బ్రిటిష్ అధికారి ‘బ్రాడీ’ తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే మన ఏజెన్సీ మారే డుమిల్లి దగ్గర పాములేరు లోయలో కాఫీ పంట సాగులోకి వచ్చిందని చెబుతారు. ఇక్కడి నుంచే అరకు ప్రాంతానికి సాగు విస్తరించింది. నిజానికి ఇతర దేశాల్లో కాఫీ గింజలను వేయిం చి, పొడిచేసి దాన్ని నీటితో మరిగించి, ఆ నీటి ని వడగట్టి కాఫీ డికాక్షన్ తయారుచేసి పంచ దారను చేర్చి తాగేవారు. మనవాళ్లు మాత్రం కాఫీ డికాక్షన్‌కు పాలను చేర్చి చిక్కటి కాఫీ తాగడం కొత్త అలవాటు. ఇక వేడివేడి పొగలు కక్కే కాఫీ తాగడం పాత సంప్రదాయం. చల్లని ఐసు ముక్కలతో కూడిన కోల్డ్ కాఫీలను ఆస్వా దించడం కొత్త అలవాటు. అయినా ఎవరి టేస్టు వారిది.. ఎవరి ట్రెండ్ వారిది.
ఆంధ్రా ఫేమస్ శొంఠి కాఫీ
రాజమహేంద్రవరం సిటీ : కాఫీలు పలు రకాలు. పూర్వం శొంఠి బెల్లం కాఫీ అనే రకం అందులో ఒకటి. విదేశాల నుంచి తెచ్చిన కాఫీ గింజలతో కాఫీ తాగడం మొదలుకాక ముందు నుంచే ఈ శొంఠి కాఫీ వినియోగంలో ఉందని చెబుతారు. వంటింట్లో లభించే సుగంధాలతోనే దీన్ని తయారుచేయడంలో మన అమ్మమ్మలు, నానమ్మలు సిద్ధహస్తులు. శుభ్రపరిచిన శొంఠి 20 గ్రాములు తీసుకుని దాన్ని మిక్సీలో వేసి మెత్తని ఫౌడరుగా తయారుచేసుకోవాలి. అలాగే 10 గ్రాములు మిరియాలు తీసుకుని దాన్ని కూడా మెత్తగా తయారుచేసుకోవాలి. అదేవిధంగా 10 గ్రాముల బెల్లం తీసుకుని దాన్ని మెత్తగా తయారుచేసి గిన్నెలో ఉంచాలి. రెండు కప్పుల నీరు గిన్నెలో పోసి స్టౌవ్‌పై పెట్టి దాన్ని మరిగించి శొంఠి, మిరియాల మిశ్రమాన్ని వేసి మరిగించాలి. ఐదునిమిషాలలోపు మరిగించి దానిని వడిగట్టి మరొక గిన్నెలో వేయాలి. తర్వాత రెండు కప్పుల పాలను తీసుకుని స్టౌవ్‌పై మరిగించి దానిని దించే ముందు శొంఠి ద్రావణాన్ని పాలలో వేసి వెంటనే బెల్లంపొడి వేసి కలిపి స్టౌ కట్టేసి దాన్ని దించి గ్లాస్‌లో తొరిపి తాగేయడమే. శొంఠి కాఫీ తాగడం వల్ల దగ్గు. జలుబు, శ్వాస సమస్యలు తగ్గుతాయని, జీర్ణశక్తి పెరుగుతుందని చెబుతారు మరి.
మన్యం కాఫీకి.. మహా డిమాండు
కాఫీ అంటే గుర్తొచ్చే మన బ్రాండ్ అరకు కాఫీ. ఈ కాఫీకి ఇప్పుడు అం తర్జాతీయంగా మంచి మార్కెట్ ఉం ది. అందులోనూ కావేరీ రకం కాఫీకి చాలా డిమాండు ఉంది. గిరిజన సహకార సంస్థ అరకు బ్రాండ్ పేరుతో ఈ కాఫీ పొడిని మార్కెట్ చేస్తోంది. దేశంలో కేరళ తర్వాత కాఫీ పంటకు మన రాష్ట్రంలోని తూర్పుకనుమలు ప్రత్యేకమైనవి. సముద్రమట్టానికి వెయ్యి నుం చి 1250 అడుగుల ఎత్తున ఉండి తోటల పెంపకానికి అనువుగా ఉంటుంది. అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో కేంద్రం కాఫీ ప్రాజెక్టుకు ప్రోత్సాహాన్నిచ్చింది. మారేడుమిల్లి, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు సముద్రమట్టానికి 1200 నుంచి 1500 అడుగుల ఎత్తులో ఉండడంతో ఇక్కడ కాఫీ తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రంప మన్యంలో కావేరీ రకం పంట హెక్టారుకు 3వేల కిలోల ముడి కాఫీ పిక్కలను ఇస్తోంది. కాఫీ మొక్క సాధారణంగా ఆరో ఏట నుంచి దిగుబడిని ఇస్తుంది. ఆరేళ్లపాటు ఎకరాకు మొత్తం రూ.28 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ఏజెన్సీలో ఒక్క మారేడుమిల్లి మండలంలో మాత్ర మే ఇప్పుడు సుమా రు 300 ఎకరాల్లో కా ఫీ సాగవుతోంది. జీసీసీ మార్కెటింగ్ చేసే అరకు బ్రాండ్ కాఫీలో ఇక్కడ పండిం చిన కాఫీ కూడా చేరుతోంది. 2007- 08 సంవత్సరంలో గిరిజన సంక్షేమశాఖ రంపచోడవరం ఐటీడీఏకు 12 వేల ఎకరాల్లో కాఫీ అభివృద్ధికి రూ.28 కోట్లు కేటాయించింది. అయితే ఆ దిశగా ఐటీడీఏ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. ఆ నిధులూ మురిగిపోయాయి. కాఫీ సాగుకు పూర్తి అనుకూలమైన మారేడుమిల్లి మండలంలో సుమారు 20వేల ఎకరాల భూమి రైతుల చేతిలో ఉండగా ఇందులో కేవలం 30 నుంచి 50 శాతం భూములు మాత్ర మే ఉపయోగంలో ఉన్నాయి. ఆయా భూముల్లోను, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల్లోనూ వారికి ఆదాయాన్నిచ్చే కాఫీ పంటను ప్రోత్సహి స్తే మంచి ఫలితాలు రావడం ఖాయం.
- రంపచోడవరం
కాఫీ కాస్ట్‌లీ.. టేస్టీ
కార్పొరేషన్(కాకినాడ) : కాఫీలో రకరకాల ఫ్లేవర్లు, కొత్త రుచులను నేటి తరం ఆస్వాదిస్తోంది. ఉమ్మడి తూర్పు పరిధిలో కొత్తరకం మెట్రో కాఫీ షాపులు వెలిశాయి. మనకి మార్కెట్‌లో లభ్యమయ్యే కాఫీలు వేరు.. ఇక్కడ దొరికేవి వేరు. ఇక్కడ ఉండే హాట్, కోల్డ్, వెరైటీ కాఫీ రుచులు, వాటి ధరలు...
క్యాపిచినో - రూ.238(350ఎంఎల్)
కాఫీ లట్టే - రూ.248(350ఎంఎల్)
ఎస్ర్పెస్సో - రూ.152(30ఎంఎల్)
డబుల్ ఎస్ర్పెస్సో - రూ.210(60ఎంఎల్)
క్లాసిక్ అఫోగతో - రూ.257(120ఎంఎల్)
ఫ్లేవర్డ్ అఫ్గోటాస్ - రూ.276(150ఎంఎల్)
హనీ సిన్నమోన్ కాఫీ - రూ.200(180ఎంఎల్)
మోచా కాఫీ - రూ.238(210ఎంఎల్)
ఐరిష్ కాఫీ - రూ.248(200ఎంఎల్)
సిగ్నేచర్ కోల్డ్ కాఫీ - రూ.257(300ఎంఎల్)
డెవిల్స్ ఒరిజినల్ కాఫీ - రూ.310(350ఎంఎల్)
కప్.. ప్రత్యేకమే..
కాఫీకి ఎంత గుర్తింపు ఉందో అది తాగే కప్పుకీ అంతే క్రేజ్ ఉంది. పూర్వం కాఫీ ఇత్తడి చెంబుల్లో తాగేవారు. తర్వాత లోటాల్లో.. ఆ తర్వాత మట్టి, స్టీలు, గాజు, పింగాణీ కప్పులు.. కప్పుసాసర్‌లో కొంతకాలం.. ఇప్పుడు కాఫీ కప్పులంటేనే వేలల్లో మోడళ్లు. కాఫీ తాగాలంటే తనకంటూ సొంతంగా ఓ కప్పు ఉండితీరాల్సిందే. రుచిగా కాఫీ తాగడమే కాదందోయ్.. అభిరుచి మేరకు తాగే కప్పు ప్రత్యేకమేనని కాఫీప్రియుల ఉవాచ.