వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Oct 17 , 2024 | 12:30 AM
కాకినాడ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తున్న వైసీపీ నాయకులపై పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. న గరంలో వైసీపీ రౌడీల ఆగడాలు ఆగ డం
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి
కాకినాడ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తున్న వైసీపీ నాయకులపై పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. న గరంలో వైసీపీ రౌడీల ఆగడాలు ఆగ డం లేదు అని అనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఉద ంతమే నిదర్శనం. స్థానిక దుమ్ములపేటకు చెం దిన టీడీపీ కార్యకర్తలు సీరం చిన్న, కోండ్రు తా తారావులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పా ల్గొనడంపై అక్కసు వెళ్ళగక్కిన వైసీపీ గూం డాలు ఓ ఆలయంలో ఉన్న వారిద్దరిపై మారణాయుధాలతో దాడి చేసి చిన్న తలపై రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. తీవ్రగాయాల పాలైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను జీజీహెచ్‌లో బుధవారం ఎమ్మెల్యే వనమాడి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం కాకినాడ నగరాన్ని గూండాలు, రౌడీలు పాలనగా తయారు చేశారన్నారు. ప్రభుత్వం మారినా వారిలో గూండాల సంస్కృతి మారలేదన్నారు. టీ డీపీ చేస్తున్న అభివృధ్ది కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునారని సీరం చిన్న, కోం డ్రు తాతారావులపై గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమ కేసులు బనాయించి, వేధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, మూగు రాజు, చోడిపల్లి సతీష్, ఏరిపల్లి రాము, కోమటి మషేనమ్మ పాల్గొన్నారు.
‘దాడులు దారుణం’
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 16(ఆంధ్ర జ్యోతి): దుమ్ములపేటకు చెందిన టీడీపీ నాయకులు కొండ్రు తాతారావు, సీరం చిన్నాలపై వైసీపీకి చెందిన నాయకులు మారణాయుధాలతో దాడులు చేయడం దారుణమని జనసేన నాయకుడు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరాన్ని గుండాల పాలనగా తయారుచేశారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని పజ్రలు గెలిపించి రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలని కోరుతున్నారని కానీ ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా ద్వారంపూడి అనుచరులు ప్రవర్తించడం సిగ్గు చేటని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.