ప్రజలను అప్రమత్తం చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:06 AM
ఏలేశ్వరం, సెప్టెంబరు 4: ఏలేరు ఆధారిక ప్రాం తంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ అధికారులను ఆదే శించారు. ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్‌ను బు ధవారం కలెక్టర్ సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో నీరు చేరుకోవడంతో అధికారుల
జిల్లాలో పలుచోట్ల పర్యటించిన కలెక్టర్
ఏలేశ్వరం, సెప్టెంబరు 4: ఏలేరు ఆధారిక ప్రాం తంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ అధికారులను ఆదే శించారు. ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్‌ను బు ధవారం కలెక్టర్ సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో నీరు చేరుకోవడంతో అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులోని వివిధ గ్యాప్‌లను పరిశీలించి ప్రస్తుత నీటి నిల్వలను అడిగి తెలుసుకున్నారు. భారీవర్షాలు కురుస్తాయనే వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యలు, జాగ్రత్తలను తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు వరద నీటిపై అంచనా ఉండాలని అందుకు అణుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవె న్యూ, నీటి పారుదల, పోలీసుశాఖలు సమన్వయం తో పని చేసి ఏలేరు వరదలతో ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కార్య క్రమంలో ఆర్డీవో జె.సీతారామారావు, తహశీల్దార్ ఆర్ వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గొల్లప్రోలు: ఏలేరు రిజర్వాయర్ నుంచి అదనపు జలాలు విడుదల చేస్తే వచ్చే వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ ఆదే శించారు. ఆయన బుధవారం గొల్లప్రోలులో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే సుద్దగడ్డ వరద ముం పులో ఉన్న సూరంపేట ప్రాంతాన్ని, అసంపూర్తిగా ఉన్న ఊబంద బ్రిడ్జిని, ఏలేరు, పీబీసీ కాలువలను, రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పంటపొలాలను పరిశీలించారు. వరద వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సూరంపేటకు పీబీసీకాలువపై నుంచి వెళ్లే మార్గంలో ఉన్న ఊబంద బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చే యాలని, తాను నిధులు ఇస్తానని కలెక్టరు తెలిపా రు. జగనన్నకాలనీ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి వరద తగ్గగానే చర్యలు చేపడతామని తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉండే గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 2వేల ఆహార ప్యాకెట్ల ను పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు. ఆయన వెంట కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, తహశీల్దార్ సత్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, ఏఈ శ్రీనివాస్, పద్మజ, డిప్యూటీ తహశీల్దార్ ఇస్మాయిల్, సివిల్‌సప్లైస్ డీటీ మర్రి వీరాస్వామి, పిషరీస్ అధికారులు రామకృష్ణ, ఉమామహేశ్వరరావు ఉన్నారు.
తాళ్లరేవు: వరదల పట్ల ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. పిల్లంక పంచాయతీ శివారు కొత్తలంక గ్రామంలో పరిస్థితులను ఆయన పరిశీలించారు. వైద్యశిబిరాలు, పారిశుధ్యం, పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎమ్. సూరిబాబు, ఎంపీడీవో ఎమ్.అనుపమ పాల్గొన్నారు.