Share News

పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:37 AM

తాళ్లరేవు, అక్టోబరు 6: ప్రకృతి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడితే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం చొల్లంగి మడఫారెస్ట్‌లో వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులను నరికివేయడం, ప్రతీచోట చెట్లను

పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి
చొల్లంగిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాట్ల

ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

తాళ్లరేవు, అక్టోబరు 6: ప్రకృతి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడితే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం చొల్లంగి మడఫారెస్ట్‌లో వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులను నరికివేయడం, ప్రతీచోట చెట్లను అధికంగా తొలగించేస్తున్నారని వాటి పర్యావసనాన్ని ప్రజలంతా చవి చూస్తున్నారన్న విషయం గమనించాలన్నారు. చె ట్లను నరకకుండా కాపాడితే అవి మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయన్నారు. 18 ఈడీసీలకు టూరి జం నిధులు రూ.2లక్షలు చొప్పున రూ.36లక్షలు చెక్కును కమిటీల చైర్మన్లకు ఎమ్మెల్యే అందిం చారు. కార్యక్రమంలో రేంజర్‌ ఆఫీసర్‌ వరప్రపాదరావు, ఎంపీపీ రాయుడు సునీత, టీడీపీ నేత లు టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి వెంకటరమణ, మందాల గంగసూర్యనారాయణ, గర్రే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మెరుగైన వైద్యసేవలందించాలి

తాళ్లరేవు మండలంలో కోస్టల్‌ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు సహకరించాలని ఆసుపత్రి కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం తాళ్లరేవు 30పడకల ఆసుపత్రిని పరిశీలించి వైద్యులతో సమావేశమై చర్చించారు. ఆసు పత్రిలో సమస్యలు, అవసరాలను సూపరిండెంట్‌ డాక్టర్‌ స్నేహలత, అభివృద్ధి కమిటీ సభ్యులు రోల్ల చక్రవర్తి, అత్తిలి బాబూరావు, వాకపల్లి సరోజనీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన మాట్లాడుతూ డెలివరీ కేసులన్నీ ఇక్కడే చేయాలని, కాకినాడ రిఫర్‌ చేయవద్దన్నారు. రోగులతో వైద్యులు సక్రమంగా ప్రవర్తించకపోయినా, వైద్యసేలను నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్‌, వాడ్రేవు వీరబాబు, మోపూరి వెంకటేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, పెమ్మాడి కృష్ణవేణి, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:37 AM