హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:07 AM
కాకినాడ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ వార్ఫురోడ్డులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ ఎం నాగదుర్గారావు నిందితుల వివరాలను వెల్లడించారు. స్థానిక పాతబస్టాండ్ వెంకటేశ్వరా కాలనీకి చెందిన బొచ్చు దాలయ్య అలియాస్ దాలీ (
కాకినాడ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ వార్ఫురోడ్డులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ ఎం నాగదుర్గారావు నిందితుల వివరాలను వెల్లడించారు. స్థానిక పాతబస్టాండ్ వెంకటేశ్వరా కాలనీకి చెందిన బొచ్చు దాలయ్య అలియాస్ దాలీ (29) వార్ఫు రోడ్డులోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ పక్క సందులో అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉండగా స్థానికులు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అనం తరం వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, సిబ్బంది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఫారెన్సిక్ వైద్యులుఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈనెల 12వ తేదీన హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులైన కచ్చేరిపేటకు చెందిన 20 ఏళ్ల పూడి మణికంఠ అలియాస్ మున్నా, పాతబస్టాండ్ చెందిన 29 ఏళ్ల చందాడి నాగబాబు అలియాస్ నాని, వెంకటేశ్వరా కాలనీకి చెందిన 39 ఏళ్ల కర్రి సంతోష్ అలియాస్ చిన్నాలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కాకినాడ ఈట్‌స్ర్టీట్‌లో ఉన్న కృపా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్దకు దాలీ మద్యం మత్తులో తరచూ వెళ్లి న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఉచితంగా ఇమ్మని గొడవ చేసి వారి వ్యాపారానికి ఆటంకం కలిగించేవాడు. ఈ విధంగా పలుసార్లు వేధించడంతో వారు విసుగు చెంది దాలిని చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి తాగి వచ్చి గొడవ చేయగా తనకు కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోయేసరికి కర్రి సంతోష్, చందాడి నాగబాబుల ఇళ్లకు దాలి వెళ్లి గొడవ చేశాడు. దాంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ పక్క సందులో దాలి నడిచి వెళ్తుండగా నిందితులు ఇనుప రాడ్లతో తలపై మోది అక్కడ నుంచి పరారయ్యారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ నాగదుర్గారావు తెలిపారు.