నేడు పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:28 PM
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 30: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని శనివారం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ భావన ఆదేశించారు. సెప్టెంబర్ 1వతేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును
ఏర్పాట్లు చేసిన అధికారులు
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 30: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని శనివారం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ భావన ఆదేశించారు. సెప్టెంబర్ 1వతేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేయాలన్నారు. ఉదయం 6 గంటల నుంచే ఇళ్ల వద్దకెళ్లి అందజేయాలన్నారు. గతంలో ఆలస్యంగా పంపిణీ చేసి న సచివాలయ సిబ్బందితో మాట్లాడి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఒక రోజులోనే వందశాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఏవైనా కారణాలతో మిగిలినవారికి 2వతేదీన అందజేయాలన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్య ంలోని 101 సచివాలయాల పరిధిలో వితంతు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు 30,210మంది ఉన్నారు. వారి కోసం రూ.12కోట్ల79లక్షల9500 కేటాయించింది. పింఛన్లు పంపిణీ చేయడానికి 638మంది సచివాలయ సిబ్బందిని నియమించారు.
సామర్లకోట: సామాజిక పింఛన్లను శనివారం సామర్లకోట ఇందిరాకాలనీ నందు పేదలకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకే అన్ని వార్డుల్లో ప్రారంభిస్తామని, తదుపరి పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చిన రాజప్ప పాల్గొంటారని మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య పేర్కొన్నారు. మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి 179మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని ఎంపీడీవో డి.శ్రీలలిత చెప్పారు. శనివారం సొమ్ములు పొందలేని వారికి సోమవారం చెల్లిస్తామని చెప్పారు.