Share News

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, రగ్బీ పోటీలకు పిఠాపురం విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:55 PM

పిఠాపురం, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు పిఠాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్‌ అథారటీ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్‌ పోటీలు, సెలక్షన్‌ ట్రయిల్స్‌ జరిగాయి. మహిళల 57కిలోల విభాగంలో కె.హరిణి, ఓపెన్‌ వెయి

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, రగ్బీ పోటీలకు పిఠాపురం విద్యార్థుల ఎంపిక
బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన పిఠాపురం విద్యార్థులు

పిఠాపురం, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు పిఠాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్‌ అథారటీ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్‌ పోటీలు, సెలక్షన్‌ ట్రయిల్స్‌ జరిగాయి. మహిళల 57కిలోల విభాగంలో కె.హరిణి, ఓపెన్‌ వెయిట్‌ కేటగిరిలో జే ఐశ్వర్య, పురుషుల విభాగం 75కిలోల కేటగిరిలో జేఆర్‌ ఆదిత్య ఎంపికయ్యారు. త్వరలో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో పాల్గొంటారని కోచ్‌ లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో గల బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన ఎంపికల్లో అండర్‌-14 విభా గంలో ఎనిమిదవ తరగతి విద్యార్థినులు పి.మనోజ్ఞ లక్ష్మీశ్రీ, ఆర్‌.విజయలక్ష్మి, అండర్‌ 17 విభాగంలో 10,9వ తరగతుల విద్యార్థినులు దొడ్డి గంగాభవానీ, జి.మణిరాజేశ్వరి ఎంపికయ్యారు. పాఠశాల హెచ్‌ఎం శ్యాంబాబు, వ్యాయామ ఉపా ధ్యాయులు శేషుకుమారి, సత్యప్రియలు అభినందించారు.

Updated Date - Oct 01 , 2024 | 11:55 PM