Share News

నులిపురుగుల నివారణకు చర్యలు : ఎమ్మెల్యే సత్యప్రభ

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:03 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 14: నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు. శనివారం మండలంలోని సిరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మందులు

నులిపురుగుల నివారణకు చర్యలు : ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం: మందులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఏలేశ్వరం, సెప్టెంబరు 14: నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు. శనివారం మండలంలోని సిరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మందులు ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే అందజేశారు. ముందుగా జాతీయ నులిపురుగుల దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు. డాక్టర్‌ శ్రీలక్ష్మీ, ఎంఈవో బి.అబ్బాయి, సర్పంచ్‌ పీతల నూకరాజు, జ్యోతుల పెదబాబు,ధనేకుల వీరభద్రరావు, ఓనుం మంగ, పెంటకోట శ్రీదర్‌, నూకతాటి ఈశ్వరుడు, నూకరాజు పాల్గొన్నారు. ఏలేశ్వరం 4వ వార్డులో శ్రీ భక్త మార్కండేయ పద్మవాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మం డపం వద్ద సుమారు 1500 మందికి అన్నదానం నిర్యహించారు. ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోని హైస్కూల్‌, వాటర్‌ ట్యాంక్‌, తోటవీధిలోని గణేష్‌ మండపాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సందర్శించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 12:03 AM