Share News

పుష్ప2 సినిమా పోస్టర్ల చించివేత

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:50 AM

పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప-2 సినిమా పోస్టర్ల చించివేత కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమాను గురువారం పిఠాపురంలో 4 థియేటర్లల్లో విడుదల నేపఽథ్యంలో పట్టణంలోని పలు

పుష్ప2 సినిమా పోస్టర్ల చించివేత

పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప-2 సినిమా పోస్టర్ల చించివేత కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమాను గురువారం పిఠాపురంలో 4 థియేటర్లల్లో విడుదల నేపఽథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పుష్ప సినిమా పోస్ట ర్లను అంటించారు. వాటిని బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఉదయమే ఈ విషయం వెలుగుచూడడంతో కలకలం రేగింది. మెగాఫ్యాన్స్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మధ్య కొంతకాలంగా సోషల్‌మీడియాలో వార్‌ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పవన్‌ ఎమ్మె ల్యేగా ఉన్న పిఠాపురంలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తమకు ఏ ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 05 , 2024 | 12:50 AM