Share News

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

ABN , Publish Date - Dec 29 , 2024 | 07:35 AM

కాకినాడ: ఎట్టకేలకు కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం లభించింది. జనవరి 4న బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరనుంది. రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో 48 రోజులుగా నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..
Stella Ship, Kakinada

కాకినాడ: ఎట్టకేలకు కాకినాడ (Kakinada)లోని స్టెల్లా షిప్‌ (Stella Ship)కు మోక్షం లభించింది. జనవరి 4న బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశానికి బయలుదేరనుంది. రేషన్ బియ్యం (Ration Rice) నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో 48 రోజులుగా నౌక నిలిచిపోయింది. ప్రస్తుతం షిప్‌లో గుర్తించిన రేషన్ బియ్యాన్ని అధికారులు దింపేస్తున్నారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న 19,785 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కించాక నౌక ప్రయాణమవుతుంది. ఈ నౌకలో రేషన్ బియ్యం పట్టుబడడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ సీజ్ ద షిప్’ అన్నారు. ఆ తర్వాత నౌకలో లోడైన బియ్యంలో రేషన్ ఎంత అని తేల్చడానికి అధికారులు నెల రోజులుగా షిప్‌ను ఆపేసిన విషయం తెలిసిందే. కాగా కాకినాడ సముద్రంలో లంగరు వేసు కుని ఉన్న స్టెల్లా ఎల్‌ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాతావర ణం అనుకూలించకపోవడం వల్ల నౌకలోని రేషన్‌ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు. దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి చేరడం లేదు. మంగళవారం (24వ తేదీ) కూడా తుఫాను ప్రభావంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు. స్టెల్లాఎల్‌ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది. దీనిలో రేషన్‌ బియ్యం ఉన్నాయనే సమా చారంతో ఈనెల 4వ తేదీన అధికారుల బృం దం తనిఖీలు చేసి గుర్తించింది. దీనిలో 1320 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నాయని ఈనెల 17వ తేదీన జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. దీంతో ఈ బియ్యాన్ని భారీ నౌక నుంచి బార్జీల ద్వారా తీసుకురావడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.


అయితే గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో రేషన్‌ బియ్యం ఒడ్డుకు తరలించడం అసాధ్యంగా మారింది. పైగా ఈనెల 26వ తేదీ నుంచి మరో తుఫాను రావడంతో ఈ ప్రక్రియ మరింతగా ఆలస్యం అయింది. ఇక ఈ భారీ నౌకలో నుంచి బియ్యం అన్‌ లోడింగ్‌ అయిన తర్వాత మరో 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని లోడింగ్‌ చేయాలి. తర్వాతే ఈ నౌక కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాలో కోటోనౌ పోర్టుకు వెళుతుంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు 26 రోజుల ప్రయాణ సమయం పడుతుంది. ఈ నౌక లోడింగ్‌ చేసుకుని వచ్చే జనవరి నెలాఖరుకు కోటోనౌ పోర్టుకు చేరుకుంటుందని నౌక అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

తారలు.. దిగివచ్చిన వేళ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 07:39 AM