Share News

కీచక ఉపాధ్యాయులు!

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:44 AM

పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ

కీచక ఉపాధ్యాయులు!
నాగుల్లంకలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేస్తున్న తల్లిదండ్రులు

నాగుల్లంకలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

సండే స్కూలు టీచర్‌ వద్ద విషయం బయటపెట్టిన విద్యార్థినులు

ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, స్థానికులు

బొమ్మూరులో బాలికను లైంగికంగా వేధించిన హిందీ ఉపాధ్యాయుడి అరెస్ట్‌

పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక ప్రాథమిక పాఠశాలలో జరిగింది. విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..... రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన పిండి శ్రీనివాస్‌ ఎంటీఎస్‌ (మినిమమ్‌ టైమ్‌ స్కేలు) ఉపాధ్యాయుడిగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పొన్న మండతో పాటు పి.గన్నవరం మండలంలోని ముంగండ, జొన్నల్లంక ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసి సెప్టెంబరు 11న నాగుల్లంక ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరాడు. 1,2 తరగతులకు హెచ్‌ఎం కె.గంగాభవానితో పాటు పాఠాలు శ్రీనివాస్‌ పాఠాలు చెప్పేవాడు. అయితే హైస్కూల్లో తరగతి గదులు లేకపోవడంతో 3,4,5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలోనే పాఠాలు చెప్తున్నారు. ఈక్రమంలో గ్రామంలో సండే స్కూ లు నిర్వహిస్తున్న చవ్వాకుల వల్లి ప్రతీ వారం విద్యార్థులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహ న కల్పిస్తుంది. అయితే ఈనెల 2వ తేదీన గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై చెప్తున్న సమయంలో మా స్కూల్లో ఉపాధ్యాయుడు బ్యాడ్‌ టచ్‌లు చేస్తున్నా డు అంటూ ఓ విద్యార్థి సండే స్కూలు టీచర్‌ దృష్టికి తీసుకువచ్చింది. అసలు ఉపాధ్యాయుడు ఎలా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులను వల్లి ఆరా తీయగా ఉపాధ్యాయుడు చేస్తున్న చేష్టలను ఒక్కొక్కటిగా వివరించారు. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చేరడంతో హెచ్‌ఎం గంగాభవానిని నిలదీశారు. దీంతో స్థానిక మహిళ పోలీసు, మండల విద్యాశాఖ అధికారిణి కె.హెలీ నా పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ కీచక ఉపాధ్యాయుడు ఆరు గురు విద్యార్థులపై చేసిన వికృత చేష్టలు సైతం బయటపడ్డాయి. పైగా విద్యార్థులే మీద పడే వారని, ఆ సమయంలో తగిలి ఉండవచ్చునని ఉపాధ్యాయుడు సమర్ధించుకునే ప్రయత్నం చేశా డు. అంతేకాకుండా ఈ కీచకుడు బాగోతాలను ప్రత్యక్షంగా పాఠశాలలో ఆయా చూసి హెచ్‌ఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. అలాగే విద్యా ర్థులకు డబ్బులు ఎరగా చూపి మచ్చిక చేసుకునే వాడని విచారణలో బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఆవేదనతో రగిలిపోతున్న విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానిక యువకులు ఉపాధ్యాయుడికి పలుమార్లు దేహశుద్ధి చేశారు. పోలీసులు జోక్యంతో స్థానికులు శాంతించగా పాఠశాలకు చేరుకున్న అంబాజీపేట ఎస్‌ఐ కె.చిరంజీవి సిబ్బందితో ఉపాధ్యాయుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని, విద్యార్థుల వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించి విషయాన్ని డీఈవో షేక్‌ సలీంభాషాకు తెలియజేసినట్టు ఎంఈవో కె.హెలీనా తెలిపారు. ఈ విచారణలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జి.వెంకటలక్ష్మి, మహిళా పోలీసు పాల్గొన్నారు.

బాలికను వేధిస్తున్న ఉపాధ్యాయుడి అరెస్టు

పోక్సో కేసు నమోదు

ధవళేశ్వరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఉన్న ప్ర భుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో బాలికను లైంగికంగా వేధించిన హిందీ ఉపాధ్యాయుడు తంగే టి సత్యనారాయణపై ధవళేశ్వరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ టి.గణేష్‌ మంగళవారం సత్యనారాయణను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించింది.

Updated Date - Dec 04 , 2024 | 12:44 AM