Share News

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన..

ABN , Publish Date - Jun 30 , 2024 | 07:18 PM

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం(Foreign Expert Team) పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(ఆదివారం) అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు.

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన..

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం(Foreign Expert Team) పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(ఆదివారం) అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన బృందంలో అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ పి.పాల్, గెయిన్ ఫ్రాంకో డి.సిక్కో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌ ఉన్నారు. పరిశీలన అనంతరం విదేశీ ఇంజినీర్లు పోలవరం నుంచి రాజమండ్రి రోడ్డు మార్గాన బయలుదేరారు.


రేపు(సోమవారం) డయాఫ్రం వాల్, ఈసీఆర్‌యఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించనున్నారు. జులై 3న వరకు జరిగే పర్యటనలో ప్రాజెక్టు ఇంజినీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహించనున్నారు. సీపేజీ తీవ్రత తెలిపే సీజీయో మీటర్ రీడింగ్‌లు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఎఎఫ్‌ఆర్‌వై ప్రతిపాదించిన జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు తుది నివేదిక ఇచ్చి జులై 4న స్వదేశాలకు వెళ్లిపోనున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Updated Date - Jun 30 , 2024 | 07:23 PM