Share News

YS Jagan: పేరుకు పరామర్శ యాత్ర.. చేసింది మాత్రం..

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:50 PM

వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..

YS Jagan: పేరుకు పరామర్శ యాత్ర.. చేసింది మాత్రం..
YS Jagan

వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు పలు విమర్శలకు కారణమవుతోంది. సందర్భంతో సంబంధం లేకుండా వ్యవహారించడం ఆయనకు మాత్రమే చెల్లుతుందన్న ప్రచారం జరుగుతోంది. వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో జగన్ తీరు, వైసీపీ నేతల వ్యవహారం చూసిన ప్రజలు మాత్రం ఆశ్యర్యపోయారనడం అతిశయోక్తికాదు. సాధారణంగా ఎవరైనా కష్టసమయాల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వెళ్లడం చూస్తూ ఉంటాం. బాధలో ఉన్నవారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తారు. వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందట.

వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ చేసిన హడావుడిని చూసి నియోకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఏవైనా రాజకీయ సభలు, సమావేశాలు ఉన్నప్పుడు లేదా ఎన్నికల ప్రచారంలో నాయకులు కొంచెం హడావుడి చేస్తుంటారు. ఫ్లెక్సీలు కట్టి.. అభిమానులతో జై కొట్టించుకుంటారు. కానీ వరద బాధితుల పరామర్శతో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్‌కు భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం, పార్టీ శ్రేణులతో జై జగన్ నినాదాలు చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా..

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవ్గంలోని ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ప్రధానంగా బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ పర్యటించారనే విమర్శలు లేకపోలేదు. జగన్ పర్యటన చూసిన తర్వాత ఆయన వరద బాధితులను పరామర్శించే పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఈ పర్యటన చేసినట్లుందనే టాక్ వినిపించింది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పిఠాపురం పర్యటన ఓ రాజకీయ పర్యటనగానే మిగిలిపోయిందట. ప్రచారం కోసమే జగన్ ప్రస్తుతం పరితప్పిస్తున్నారనే విషయం ఆయన పిఠాపురం పర్యటన తెలియజేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.


పర్యటనపై విమర్శలు..

ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి.. వైసీపీ అనుకూలమైన గ్రామాల్లో పర్యటించారనే విమర్శలు వస్తున్నాయి. అసలు బాధితులను జగన్ పరామర్శించలేదని, కేవలం కొందరు పార్టీ సానుభూతి పరుల కుటుంబాలకు చెందిన వారిని మాత్రమే పరామర్శించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ పిఠాపురం పర్యటనపై మాత్రం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 14 , 2024 | 12:50 PM