Share News

VC Acharya Srikrishna Devarayudu : యువత జ్ఞానం, నైపుణ్యాలు సమాజానికి ఉపయోగపడాలి

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:19 AM

ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య ఒక్కటేనని హైదరాబాదులోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా వైస్‌ చాన్సలర్‌ ఆచార్య శ్రీకృష్ణదేవరావ్‌ అన్నారు.

VC Acharya Srikrishna Devarayudu : యువత జ్ఞానం, నైపుణ్యాలు సమాజానికి ఉపయోగపడాలి

  • నల్సార్‌ లా వర్సిటీ ఉప కులపతి ఆచార్య శ్రీకృష్ణదేవరావ్‌

  • విజ్ఞాన్‌ వర్సిటీలో ఘనంగా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్నాతకోత్సవం

గుంటూరు(విద్య), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య ఒక్కటేనని హైదరాబాదులోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా వైస్‌ చాన్సలర్‌ ఆచార్య శ్రీకృష్ణదేవరావ్‌ అన్నారు. శనివారం గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి నైపుణ్యం, ప్రతిభ ఉన్న విద్యార్థులను విజ్ఞాన్‌ వర్సిటీ అందించడం హర్షణీయమని అన్నారు. విద్య అనేది చిన్న జిజ్ఞాస, లక్ష్యంతో మొదలై జ్ఞానం, సామర్ధ్యాలు అనే పెద్ద వృక్షంగా పెరుగుతుందన్నారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ చెప్పినట్టుగా జ్ఞానం సృజనకు దారితీస్తుందని, సృజన ఆలోచనకు, ఆలోచన జ్ఞానానికి, జ్ఞానం వ్యక్తిని గొప్పగా మారుస్తుందన్నారు. యువత జ్ఞానం, నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు. విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పి.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్నాతకోత్సవం సందర్భంగా 860 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, బోర్డు మేనేజమెంట్‌ సభ్యులు, డీన్లు, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 05:20 AM