Rajya Sabha: నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2024-02-08T15:25:05+05:30 IST

రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Rajya Sabha: నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. అలాగే ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలావుండగా రాజ్యసభ ఎన్నికల్లో ఎంత మందికి ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు వచ్చిన అనర్హత పిటిషన్లపై గురువారం స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోనున్నారు.

YS Sharmila: కొత్త చట్టాలు తెచ్చేది.. భూ కబ్జాల కోసమే..

Updated Date - 2024-02-08T15:25:07+05:30 IST