AP Election 2024: చంద్రబాబును కలిసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ABN , Publish Date - Apr 02 , 2024 | 06:44 PM
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వేర్వేరు పార్టీల తరపున టికెట్లు ఖరారైన అభ్యర్థులు గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల తరపున సీట్లు ఖరారైన వ్యక్తులు ప్రచారాన్ని ప్రారంభించారు. కీలకమైన వ్యక్తులను కలుస్తూ, సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కలిశారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వేర్వేరు పార్టీల తరపున టికెట్లు ఖరారైన అభ్యర్థులు గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల తరపున సీట్లు ఖరారైన వ్యక్తులు ప్రచారాన్ని ప్రారంభించారు. కీలకమైన వ్యక్తులను కలుస్తూ, సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కలిశారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మవరం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
కూటమి తరపున బరిలో దిగిన సత్యకుమార్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో వైసీపీ అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఈ సందర్భంగా సత్య కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ సారధ్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సహకారంతో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఏర్పాటు చేయడం ఖాయమని సత్య కుమార్ దీమా వ్యక్తం చేశారు.
సత్య కుమార్ ఏమన్నారంటే..
‘‘తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం కోరాను. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది. ఏపీలో వైసీపీ అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో, రాష్ట్రంలో పవన్ గారి సహకారంతో, బాబు గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుంది. అంధకారం తొలిగి వెలుగులు ప్రసరించనున్నాయి’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడితో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Govt: పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి