Share News

AP News: అందుకే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:19 PM

రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయించిందని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు.

AP News: అందుకే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

చిత్తూరు: రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి నిర్ణయించిందని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి(Former CM Kiran kumar reddy) తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు. రాజంపేట(Rajampet) ఎంపీతోపాటు పార్లమెంట్ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేందరం ఘనవిజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదేళ్లలో ఏం జరిగిందో నా కంటే మీకే బాగా తెలుసు. 2014 తర్వాత మళ్లీ నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం అవినీతిని మట్టి కరిపించడానికి.

నరేంద్ర మోదీ(Narendra Modi) 10 సంవత్సరాలు ప్రధానిగా, 12 సంవత్సరాలు గుజరాత్ సీఎం మచ్చలేని నేత. ప్రజల కోసం ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి. ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ వ్యక్తి మోదీ. ఐదు ఇస్లామిక్ దేశాలలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి మోదీ. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని మోదీ ముందే చెప్పారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ప్రతి నెల ఆర్బీఐ, కేంద్రం నుంచి అప్పు తీసుకోకపోతే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం మేము కలిశాం. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గల ప్రజలు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్‌గా ప్రారంభమై ప్రభుత్వం, రాజకీయాల్లో ఉంటూ... ప్రభుత్వాన్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.


2019 నుంచి పాలు, మామిడిపండు వ్యాపారంతో ప్రజల నోరుకొట్టారు. ఇసుక, మద్యం, గనులు, భూములు కొల్లగొట్టి దోచేశారు. అడ్డు వచ్చిన వారిపై దొంగ పోలీసు కేసులు పెట్టి దౌర్జన్యకరమైన వాతావరణం సృష్టించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో 35 వేల దొంగ ఓటర్ కార్డులు సృష్టించారు. ప్రజా ప్రతినిధులు ఏమి చేయకూడదో అదే చేశారు. దీంతో కలెక్టర్లు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ సీబీఐతో విచారణ జరిపించాలి. తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. తిరుపతి సంఘటన ఎలక్షన్ కమిషన్‌కు చాలెంజ్‌ చేసే అంశం. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఒక నిఘా పెట్టాలి. ఓటర్లకు సెక్యూరిటీ కల్పించి స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి. ప్రస్తుత రాజకీయల్లోని అవినీతి చూసి ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాను. అధికారంలోకి కచ్చితంగా వస్తాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది.’’ అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

chandrababu: ‘జగన్‌కు బాగా అర్థమైంది’

Updated Date - Mar 30 , 2024 | 06:27 PM