Share News

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:25 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha polls2024) సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతమయ్యింది. పార్టీలకు అతీతంగా సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులపై సంచలన వాఖ్యలు చేశారు.

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కడప: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha polls2024) సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతమయ్యింది. పార్టీలకు అతీతంగా సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులపై సంచలన వాఖ్యలు చేశారు.


కంటికి రాయిదెబ్బ తగిలితే రాయి చూపరంటూ జగన్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతీలకు వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన అన్నివిషయాలు ముందే తెలుసునని అన్నారు. సీబీఐ వద్ద అన్ని రికార్డులు వున్నాయని, అప్పట్లో ప్రతిరోజూ తనను ఇబ్బందులు పెట్టారని ఆది నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ వివేకా కేసులో నాకు సంబంధించి ఒక్క పాయింట్ ఉన్నా.. నా పాత్ర ఉన్నా నన్ను బహిరంగంగా ఉరి తీయండి’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి కోడికత్తి కేసు కూడా తన మీద పెట్టాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పల్లెలో ఏయే సహజ వన రులున్నాయో తెలుసుకోవడానికి ఎమ్మెల్యే సుధీర్ గ్రామాల్లో తిరుగుచున్నాడని మండిపడ్డారు.


జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, ఎమ్మెల్యే సుధీర్ చిత్తుచిత్తుగా ఓడిపోతారని ధ్వజమెత్తారు. ‘‘ఎమ్మెల్యే కన్నా మా ఊరిలో దొంగ కోళ్లు పట్టుకునే బీమన్న మేలు..’’ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘‘ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో... అతిగా మాట్లాడితే చెప్పు తెగుతుంది’’ తీవ్ర హెచ్చరిక చేశారు.

ఇవి కూడా చదవండి

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

AP Politics: నెగిటివ్‌ను పాజిటివ్‌గా మార్చుకునే కుట్ర జరుగుతుందా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 05:09 PM