జవహర్ స్థానం అక్కడ..!
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:08 AM
సీనియారిటీలో ఆయనకు ముందు చాలామందే ఉన్నా, జవహర్‌రెడ్డిని జగన్ సీఎ్‌సను చేశా రు. ప్రభుత్వం మారి, సీఎస్ పో స్టు పోగానే ఇప్పుడు ఆయన స్థా నం ఏమిటనేది తెలిసింది.
పోస్టు పోయాక సీనియారిటీలో ఆరో స్థానానికి మాజీ సీఎస్
అప్పట్లో ఏరికోరి సీఎస్‌ను చేసిన జగన్
అదేస్థాయిలో స్వామిభక్తి చాటిన జవహర్
ప్రభుత్వం మారగానే ‘అసలు’ స్థానానికి!
జవహర్‌కు ముందు నీరబ్, పూనం,శ్రీలక్ష్మి,
కరికాల వలవన్, రజిత్ భార్గవ్...
జాబితాను సవరించిన జీఏడీ
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సీనియారిటీలో ఆయనకు ముందు చాలామందే ఉన్నా, జవహర్‌రెడ్డిని.. (Jawahar Reddy) వైఎస్ జగన్ (YS Jagan) సీఎస్‌ను చేశారు. ప్రభుత్వం మారి, సీఎస్ పోస్టు పోగానే ఇప్పుడు ఆయన స్థానం ఏమిటనేది తెలిసింది. మరో ఇరవై రోజుల్లో పదవీవిరమణ చేయనున్న జవహర్.. సీనియారిటీ జాబితాలో ఆరో స్థానానికి చేరారు. కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ జాబితాలో ముందున్నారు. ఆయన తర్వాత వరుసగా పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, కరికాల వలవన్, రజిత్ భార్గవ్ ఉన్నారు. వారి తర్వాత జవహర్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు ఐఏఎ్‌సల సీనియారిటీ జాబితాను సాధారణ పరిపాలన విభాగం తాజా పరిచింది. కరికాల వలవన్ రిటైర్ అయినా జగన్ ప్రభుత్వం ఆతని సర్వీస్‌ను ఏడాదిపాటు పొడిగిస్తూ దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే.
జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అధికార ప్రయోగం చేశారన్న తీవ్ర విమర్శను జవహర్‌రెడ్డి ఎదుర్కొన్నారు. తనను జగన్ అందలం ఎక్కించారన్న స్వామి భక్తిని ఆయన ‘అతి’గా ప్రదర్శించుకున్నారు. చివరికి ఎన్నికల సమయంలో సైతం జగన్ ప్రభుత్వానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో గందరగోళం, ఎప్పుడో బటన్ నొక్కితే ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలా ప్రయత్నం చేయడం ...ఇలా జగన్‌కి మేలు జరిగేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ గెలుపు కోసం తాపత్రయ పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఆయనకు పోస్టింగ్ లేకుండాపోయింది. సీనియారిటీ జాబితాను జీఏడీ ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది. ఆ జాబితా ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవాలి. అయితే, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో ఎవరినైనా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని చేసే అవకావం ఉంది. కానీ జవహర్ రెడ్డి విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది.