-
-
Home » Andhra Pradesh » Elections » PM Narendra Modi attend Prajagalam Public Meeting Along with TDP Chief Chandrababu Naidu and Janasena Pawan Kalay at Rajamahendravaram, Andhrajyothy Live Updates, Siva
-
Prajagalam Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం..
ABN , First Publish Date - May 06 , 2024 | 03:39 PM
PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు..
Live News & Update
-
2024-05-06T16:40:23+05:30
మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఏపీకి అవసరం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు.
-
2024-05-06T16:33:38+05:30
వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప..రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు: మోదీ
వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప..రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు
రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది
రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించింది
కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది
-
2024-05-06T16:30:32+05:30
మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపీ: మోదీ
ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది
అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారు
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్ స్పీడ్‌తో పరిగెత్తింది
మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు
మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపీ
అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు
-
2024-05-06T16:21:00+05:30
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోదీ
పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అథోగతిపాలు చేసింది
ఈడీ..ఈడీ..అంటూ ఇండి కూటమి గగ్గోలు పెడుతోంది
కాంగ్రెస్ నేతల దగ్గర గుట్టలకొద్దీ డబ్బు బయటపడుతోంది
కాంగ్రెస్ నేతల డబ్బును మిషన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి
-
2024-05-06T16:11:55+05:30
వైసీపీ సర్కార్‌పై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..
వైసీపీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందన్నారు. అందుకే వైసీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు ప్రధాని.
-
2024-05-06T16:07:23+05:30
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు.
వికసిత ఆంధ్ర, వికసిత భారత్ తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
-
2024-05-06T16:05:18+05:30
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ
నా ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు
ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నాం
దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం
మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం కాబోతుంది
-
2024-05-06T16:00:03+05:30
కేంద్ర పథకాలకు జగన్, వైఎస్ పేర్లు పెట్టుకున్నారు: పవన్
కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు
జగన్ పాలనలో అడుగడుగునా కుంభకోణాలే
మోదీ వికసిత్ భారత్ కలలో మేమూ భాగస్వాములం అవుతాం
గతంలో పద్మ అవార్డులు రాజకీయాలు చేసేవారికే వచ్చేవి
మోదీ హయాంలో అసలైన అర్హులకు పద్మ అవార్డులు దక్కుతున్నాయి
-
2024-05-06T15:58:59+05:30
భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ: పవన్
అయోధ్యకు రామచంద్రుడిని తీసుకువచ్చిన మహానుభావుడు మోదీ
భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ
దేశానికి అభివృద్ధితోపాటు గుండె ధైర్యం అవసరం
శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునే గుండె ధైర్యం కావాలి
పదేళ్లుగా భారత్ వైపు చూడాలంటేనే భయపడుతున్న శత్రువులు
మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోంది
కేంద్ర పథకాలను తన పథకాలుగా వైసీపీ చెప్పుకుంటోం
కేంద్ర పథకాలను జగన్ అందిపుచ్చుకోలేకపోయాడు
-
2024-05-06T15:52:07+05:30
మోదీ స్ఫూర్తి, బాబు యుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం: పురందేశ్వరి
సబ్ కా సాథ్..సబ్ కా వికాస్..అనేది బీజేపీ విధానం
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు..అనేది టీడీపీ విధానం
బాధితుల పక్షాన నిలబడటం జనసేన విధానం
జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు
-
2024-05-06T15:52:01+05:30
నరేంద్ర మోదీ విశ్వజీత్: నారా లోకేష్
విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయించినవారని అర్థం
ప్రపంచంలో అగ్రగామిగా భారత్‌ను నిలుపుతున్న మోదీ
దేశం దశ..దిశ.. మార్చింది నమో నమో అనే 4 అక్షరాలు
తెలుగు పౌరుషాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్
భారత్ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మోదీ
టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాం
టీడీపీ హయాంలో విశాఖను ఐటీ హబ్‌గా చేశాం
యువతకు ఉపాధి ఎలా అందించాలో బాబుకు తెలుసు
జగన్ పాలనలో తొలి బాధితులు యువతే
-
2024-05-06T15:47:21+05:30
ప్రజాగళం సభలో ఆసక్తికర సన్నివేశం..
రాజమహేంద్రవరంలో జరుగుతున్న ప్రజాగళం సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభా వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు. అయితే, కాళ్లు మొక్కొద్దంటూ పవన్ కల్యాన్‌ను ప్రధాని మోదీ వారించారు.
-
2024-05-06T15:44:21+05:30
ప్రజాగళం సభలో బాబుకు బదులుగా లోకేష్..
ప్రజాగళం సభకు చంద్రబాబు హాజరవలేదు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ సభకు హాజరయ్యారు. లోకేష్‌ను భుజం తట్టి ప్రధాని మోదీ అభినందించారు.
-
2024-05-06T15:35:41+05:30
PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర ఇవాళ ఏపీలో ప్రచారం నిర్వహించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో చేపట్టిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం పాయింట్స్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..