AP Elections 2024: సాయంత్రం 5 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైందంటే?
ABN , Publish Date - May 13 , 2024 | 05:50 PM
ఏపీలో కొనసాగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా..
ఏపీలో కొనసాగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుష ఓటర్లు (64.28%) ఉండగా.. 1.40 కోట్లకు పైగా మహిళలు (66.84%) పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పురుషులతో పోలిస్తే.. మహిళలే చురుగ్గా ఈ పోలింగ్‌లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. అటు.. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.