Share News

AP Elections: అధికారంలోకి వస్తే ఆదోనిలో టమాటో ప్రాసెసింట్ యూనిట్

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:17 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు.

AP Elections: అధికారంలోకి వస్తే ఆదోనిలో టమాటో ప్రాసెసింట్ యూనిట్
Tomato Processing Unit Will Be Establish At Adoni

కర్నూలు : ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అధికారం రాక ముందు హోదా గురించి మాట్లాడిన జగన్.. ఆ తర్వాత విషయం మరచిపోయాడని విమర్శించారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవని వివరించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.


ఆదోని ఎమ్మెల్యేపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఎమ్మెల్యే పేకటా రాయుడు అంట కదా..? రూ.కోటి రిజిస్ట్రేషన్ అయితే కానీ ఇంటికి వెళ్లరట కదా..? దోపిడీదారులకు ఓట్లు వేయాలా..? ఆదోనిలో ప్రత్తి పంట ఎక్కువ. వైఎస్ఆర్ హయాంలో పత్తి క్వింటా రూ. 12 వేలు పలికేది. ఇప్పుడు రూ.6 వేలు కూడా రావడం లేదు. స్పిన్నింగ్ మిల్స్ మూత పడితే తెరిచే పరిస్థితి లేదు. టెక్స్ టైల్స్ పెడతాం.. పరిశ్రమలు పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. ఒక్క హామీ నిలబెట్టుకున్నారా ? బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుంది. మంట పెట్టి చాలి కాచుకుంటుంది అని’ షర్మిల విరుచుకుపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హోదా తీసుకొస్తుందని షర్మిల వివరించారు. ఆదోనిలో టమాట ప్రాసెసింట్ యూనిట్ నెలకొల్పుతామని స్పష్టం చేశారు. లేదంటే తమ పార్టీ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ సొంత ఖర్చులతో పెడతానని మాట ఇస్తున్నాడని వివరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 06:52 PM