AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?
ABN , Publish Date - May 17 , 2024 | 07:46 PM
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది. నిత్యం అటు మీడియాలోనో... ఇటు సోషల్ మీడియాలోనే స్పందించే విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని సదరు సర్కిల్‌లో ఓ ప్రశ్న అయితే క్తమవుతుంది.
పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై వైసీపీలోని పలువురు కీలక నేతలు స్పందించారని.. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఎందుకు స్పందించ లేదని సందేహం వ్యక్తమవుతుంది. అయితే ప్రతి విషయంలో స్పందించే విజయసాయిరెడ్డి ఇలా సైలెంట్‌గా ఉండడం వెనుకు ఏమైనా కారణాలున్నాయా? అని పోలిటికల్ సర్కిల్‌లో అనుమానం సైతం వ్యక్తమవుతుంది.
లేకుంటే నెల్లూరులో తనకు ఓటమి తప్పదనే విషయం ఆయనకు ముందుగానే తెలిసిపోయిందా?.. అందుకే ఆయన సైడ్ అయిపోయారా? అని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ కూడా నడుస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
కానీ ఏడాది క్రితం ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనుహ్య విజయం సాధించారు. అనంతరం నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత జిల్లాలో వైసీపీ పరిస్థితి కూడా అంతే వేగంగా మారిపోయాయి. అలాగే ఇటీవల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నెల్లూరుకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో విజయసాయిరెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా వేమిరెడ్డి బరిలో నిలిచారు. అయితే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇప్పటికే జిల్లాలో బలంగా వినిపిస్తుంది. అందుకే విజయసాయిరెడ్డి సైలెంట్‌గా సైడ్ అయిపోయారా? అనే ప్రశ్న సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత.. రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలపై వైసీపీలోని వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని... కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడా? అనే ఓ చర్చ అయితే హల్‌చల్ చేస్తుంది. మరోవైపు వైయస్ వివేకా దారుణ హత్యకు గురైతే.. ఆయన గుండె పోటుతో మరణించారంటూ తొలిసారి మీడియా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డేనని ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.
అలాగే నందమూరి తారకరత్న తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. ఇదే విజయసాయిరెడ్డి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియా ముందు విపులీకరించి చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి.. ఎన్నికల పోలింగ్ పూర్తైన తర్వాత వెంటనే.. తనకు సహకరించిన పార్టీ శ్రేణులకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపి.. ఆ తర్వాత ఇలా సైలెంట్ అయిపోవడం ఏమి బాగోలేదని రాజకీయ వర్గాల్లో ఓ అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.
ఓ వేళ..ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఈ నేపథ్యంలో స్పందించకూడదని ఆయన భావిస్తుంటే.. కనీసం ట్విట్టర్ వేదికగా అయినా గంటకో.. పూటకో.. రోజుకో ఒకసారి అయినా విజయసాయిరెడ్డి స్పందిస్తే బాగుంటుందని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సైతం నడుస్తుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News