Share News

AP Election 2024: వైఎస్ జగన్‌కు షర్మిల సూటిప్రశ్న

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:36 PM

అధికార వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టో -2024పై విమర్శల పర్వం కొనసాగుతోంది. 2019లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారంటూ విపక్షాల నుంచి రాజకీయ నిపుణుల వరకు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీసీసీ వైఎస్ షర్మిల కూడా తన గొంతు కలిపారు.

AP Election 2024: వైఎస్ జగన్‌కు షర్మిల సూటిప్రశ్న

అధికార వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టో -2024పై విమర్శల పర్వం కొనసాగుతోంది. 2019లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారంటూ విపక్షాల నుంచి రాజకీయ నిపుణుల వరకు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీసీసీ వైఎస్ షర్మిల కూడా తన గొంతు కలిపారు. ‘‘ మీ హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలి’’ అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆదివారం స్పందించారు.


‘‘మీకు, మీ మాటకు విలువ లేదు. అలాగే మీ మేనిఫెస్టోకి విలువ లేదు’’ అంటూ పాలకపక్షంపై షర్మిల ధ్వజమెత్తారు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదని, ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? అని ఆమె ప్రశ్నించారు. ‘‘మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు.. అందులో చెప్పిన ఒక్క అంశం నెరవేర్చలేదు. ప్రజలు మీ హామీలను ఎందుకు నమ్మాలి?’’ అని షర్మిల నిలదీశారు. ‘‘కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు’’ అని ప్రశ్నించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2024 | 03:47 PM