Share News

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:20 AM

ఊరు కన్నీళ్లు పెట్టింది.. అయ్యో పాపం అంటూ నివాళులర్పించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం..

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

సీతానగరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఊరు కన్నీళ్లు పెట్టింది.. అయ్యో పాపం అంటూ నివాళులర్పించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని సద్గురు శ్రీ చిట్టిబాబాజీ ఆశ్రమానికి 2009 ఆగస్టు 10వ తేదీన అప్పటి అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జార్జిఖండ్‌ మూడున్నర ఏళ్ల వయసు ఉన్న ఏనుగును బహూకరించారు. ఆశ్రమంలో అడుగుపెట్టిన ఏనుగుకు లీల అని నామకరణం చేశారు. గత 19 ఏళ్లుగా గ్రామస్థులకు ఆ ఏనుగుతో అనుబంధం పెరిగింది. ఈ నేపథ్యంలో లీల శనివారం అర్ధరాత్రి 12:25 గంటలకు తుదిశ్వాస విడిచింది. జిల్లా అటవీశాఖాధికారి ఏనుగు కళేబరానికి పంచనామా నిర్వహించి ఖననం చేయడానికి అనుమతిచ్చారు. పెదకొండేపూడిలోని గోశాలలో ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 05:20 AM