Share News

AP Politics: మరీ ఇలా అయితే ఎలా జగన్..

ABN , Publish Date - Oct 25 , 2024 | 02:15 PM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్ల పర్యటించారు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పర్యటన అసహనం, గందరగోళం మధ్య సాగింది. ముందుగా ఎస్ఎస్ఆర్పేట నుంచి బయలుదేరిన వెఎస్ జగన్.. గుర్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఒకవైపు బాధితులు, మరోవైపు ప్రజలు, ఇంకోవైపు నాయకుల హడావిడి ఎక్కువకావడంతో ఒక్కసారిగా..

AP Politics: మరీ ఇలా అయితే ఎలా జగన్..
YS Jagan

విజయనగరం, అక్టోబరు 24: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్ల పర్యటించారు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పర్యటన అసహనం, గందరగోళం మధ్య సాగింది. ముందుగా ఎస్ఎస్ఆర్పేట నుంచి బయలుదేరిన వెఎస్ జగన్.. గుర్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఒకవైపు బాధితులు, మరోవైపు ప్రజలు, ఇంకోవైపు నాయకుల హడావిడి ఎక్కువకావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. జగన్‌ను చూసిన ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తల కేరింతలు, అరుపులతో హోరెత్తించారు. కాకపోతే ఈ అరుపులే జగన్‌కు చిరాకు తెప్పించాయి. కార్యకర్తల అతిని చూసిన జగన్ అసహనానికి గురయ్యారు. ఇక్కడ లాభం లేదనుకుని అక్కడి నుంచి కొంతదూరం వెళ్లిపోయారు. ఇలా దెబ్బైపోతమని భావించి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెంటనే అలర్ట్ అయి.. జగన్‌ను వెనక్కి తీసుకువచ్చారు. ఈ సమయంలో వైఎస్ జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. వైసీపీ తరఫున డయేరియా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


అయితే, ఈ పర్యటనలో జగన్ వ్యవహారశైలిపై ఇటు సొంత పార్టీ నేతల్లో, అటు ప్రజల్లోనూ ఒకరకమైన చర్చ నడుస్తోంది. జగన్‌కు మరీ ఇంత అసహనమైతే ఎలా? అని చర్చించుకుంటున్నారు. జనాల్లోకి వచ్చినప్పుడు.. అభిమానులు, కార్యకర్తలు సహజంగానే నినాదాలు, అరుపులు, కేకలతో హోరెత్తిస్తారు. ఆపాటిదానికే.. అసంతృప్తితో వెనక్కి వెళతారా? అని ప్రశ్నిస్తున్నారు. వచ్చిందే బాధితులను పరామర్శించేందుకు.. అది చేయకుండా కోపంతో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. గుర్లలో జగన్ ప్రవర్తించిన తీరు వైసీపీ కేడర్‌లో, ప్రజల్లో చర్చనీయాశమైంది.


అందరినీ ఆదుకుంటాం..

ఇదిలాఉంటే.. గుర్లలో డయేరియా బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. ‘ప్రజల కు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్కడకు నేను వెళ్లి వారికి అండగా ఉంటున్నా. గుర్లలో డయేరియాను అదుపు చేయకుండా చంద్ర బాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, మంత్రు లు, ఉన్నతాధికారులు తలోమాట ఆడుతున్నా రు. వాస్తవంగా గుర్ల తదితర గ్రామాల్లో 14 మంది డయేరియాతో చనిపోయారు. కానీ, చంద్రబాబు 8 మంది అని, దత్తపుత్రుడు 10 మంది అని, మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ ఒక్కరు మాత్రమే చనిపోయారని చెబుతున్నారు. వీరు వాస్తవాలు మాట్లాడడం లేదు. డయేరియా విషయమై నేను ఈ నెల 19న ట్వీట్ చేశా. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు' అన్నారు.

'మంచినీటి సమస్యతో గుర్లలో డయేరియా ప్రబలింది. రక్షిత ట్యాంకులను సమయానికి శుభ్రం చేయాల్సి ఉంది. కానీ, అధికారులు పట్టించుకో కపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చంపావతి నది నీళ్లు దారుణంగా ఉన్నాయి. గుర్ల మండలానికి సంబంధించి 345 మంది డయేరియా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అంతకంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ గరివిడి, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసుల నమోదవుతున్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు' అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, పుష్పశ్రీవాణి, జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


Also Read:

ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన

ఫ్యామిలీ సీక్రెట్స్ మొత్తం చెప్పేశారు..

ఉషమ్మా.. ఇదేందమ్మా.. ఇంకా ఆ భ్రమలోనే ఉంటే ఎలా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 02:15 PM