Share News

Rejoin TDP : నేడు టీడీపీలోకి ఆళ్ల నాని!

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:43 AM

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం సైకిల్‌ ఎక్కబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో..

Rejoin TDP : నేడు టీడీపీలోకి ఆళ్ల నాని!

ఏలూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం సైకిల్‌ ఎక్కబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆది నుంచీ ఆయన వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడు. ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున, 2019లో వైసీపీ తరఫున గెలుపొందిన ఆళ్ల నాని.. జగన్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో 62 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేసిన ఆయన.. రెండు నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తర్వాత మనసు మార్చుకుని టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యే బడేటి చంటి వారిని కొంతవరకు ఒప్పించగలిగారు. దీంతో నాని చేరికకు తెలుగుదేశం నాయకత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Dec 18 , 2024 | 05:43 AM