Andhra Pradesh: అమరావతి రాజధాని కావాలంటే వైసీపీని ఓడించాలి.. మాజీ మంత్రి
ABN , Publish Date - Feb 28 , 2024 | 06:32 PM
అమరావతి రాజధానిగా ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రి కాకూడదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రి కాకూడదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, రాజధాని కోసం 33, 000 ఎకరాలు రైతులు ఇవ్వడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. వైసీపీ నేతలకు అమరావతి పేరే గిట్టడం లేదని ఫైర్ అయ్యారు. సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదని, అందరినీ సమానంగా చూడాలని అన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు కోసం సభ పెడితే వేల మంది వచ్చారన్న ఆయన రాష్ట్రంలో సంక్షేమం అవసరమే అయిప్పటికీ అభివృద్ధి ఇంకా అత్యంత అవసరం అనే విషయాన్ని గుర్తెరిగి పాలించాలని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు సీఎం కావాలి అని వసంత నాగేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ ప్రజా సమస్యలను విస్మరించారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం వసంత నాగేశ్వరరావును మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు కలిశారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. మైలవరం టికెట్ ఆయనకు కంఫార్మ్ అయిందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే టీడీపీ - జనసేన కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.