ఇకపై వారానికి ఒక్కసారే ఇన్సులిన్
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:21 AM
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్‌కుమార్ స్పష్టం చేశారు.
షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి..
షుగర్ వైద్య నిపుణుడు ఎ.రామ్‌కుమార్
గుంటూరు(మెడికల్), సెప్టెంబరు 21: షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్‌కుమార్ స్పష్టం చేశారు. స్పెయిన్ దేశంలోని మ్యాడ్రీడ్ నగరంలో యూరోపియిన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 13000లకు పైగా డాక్టర్లు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో షుగర్ వ్యాధిలో నూతన చికిత్స విధానాలు, పరికరాలు గురించి చర్చించారు. సదస్సుకు హాజరైన రామ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘షుగర్ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు బాసల్ ఇన్సులిన్, అంటే రోజుకోసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటుంటే, త్వరలో వారానికి ఒక్కసారి (ప్రతి ఆదివారం) తీసుకుంటే సరిపోతుంది. దీని పేరు ఏడబ్లూఐక్యూఎల్‌ఐ. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. ఇది మన దేశానికి కూడా త్వరలో రావచ్చు. ఆహార నియంత్రణ పాటిస్తూ లో-క్యాలరీ డైట్ ద్వారా ఇది సాధించవచ్చు. బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్ రాయ్ టేలర్ చేసిన పరిశోధనల్లో తేలింది’ అని డాక్టర్ రామ్ కుమార్ వెల్లడించారు.