Share News

BPCL: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉన్నతాధికారులు మంగళవారం అమరావతిలో సమావేశమై తీర్మానం చేశారు. రూ. 6100 కోట్లోతో ఈ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నారు.

BPCL: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

అమరావతి, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తాయి. తాజాగా భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ. 6100 కోట్ల రూపాయిలతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో తీర్మానం చేసినట్లు భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఈ తీర్మానంపై నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు సైతం బీపీసీఎల్ లేఖ రాసింది.

Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్


ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ కోస్ట్‌లో ఈ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా బీపీసీఎల్ వివరించింది. అలాగే ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అందులోభాగంగా ప్రాధమిక అధ్యయనం, భూమి గుర్తింపు, సేకరణ, ఫీజుబులిటి రిపోర్టు, పర్యావరణ ప్రభావం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పనులు చేపడుతున్నామని బీపీసీఎల్ వివరణ ఇచ్చింది. ఇక ఇంజనీరింగ్ ప్యాకేజితోపాటు డిజైన్లు సైతం పరిశీలిస్తున్నామని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది.


చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ కంపెనీలు సైతం క్యూ కట్టాయి. అందులోభాగంగా ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి లూలు సంస్థ వెళ్లి పోయింది. ఆ సంస్థ సైతం మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకొంది. అందులోభాగంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. టాటా సంస్థతోపాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఏపీలో తన సంస్థలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి.


అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చింది లేదు. అలాగే లూలూ సంస్థ కూడా ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో.. ఉపాది కోసం యువత దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లిన విషయం విధితమే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించారు. అందుకే.. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటుకు దేశవిదేశీ సంస్థలు క్యూ కడుతోన్నాయి.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 07:14 PM