Home » BPCL
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉన్నతాధికారులు మంగళవారం అమరావతిలో సమావేశమై తీర్మానం చేశారు. రూ. 6100 కోట్లోతో ఈ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ, విదేశీ సంస్థల పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పావులు కదుపుతున్నారు. ఈ మేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), విన్ ఫాస్ట్(WIN FAST) సంస్థల ప్రతినిధులతో సచివాయలంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు.
చంద్రబాబు(CM Chandrababu) ఇలా ముఖ్యమంత్రి అవడమే ఆలస్యం అన్నట్లుగా.. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి పలు సంస్థలు. అవును, ఏపీకి త్వరలో శుభవార్త అందనుంది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.