YCP Mla Vara Prasad: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ
ABN , Publish Date - Jan 24 , 2024 | 06:02 PM
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బుధవారం నాడు వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉండి టికెట్ ఖరారు కాని అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీ అధినేతలతో సమావేశమై సీట్లను ఖరారు చేసుకునే పనిలో మునిగిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్‌సీపీ పార్టీ (YCP) భారీగా మారుస్తున్న నేపథ్యంలో టికెట్ దక్కనివారు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఆ జాబితాలో సీనియర్ నేత, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా చేరిపోయారు. గూడూరు వైసీపీ టికెట్‌ను మేరుగ మురళికి కేటాయించిన సంగతి తెలిసిందే. దాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బుధవారం వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు.
జనసేనలోకి కొణతాల..
పవన్ కల్యాణ్‌తో కొణతాల రామకృష్ణ సమావేశం అయ్యారు. జనసేనలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి లోక్ సభ స్థానానికి జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. నేతల చేరికతో సెగ్మెంట్ల వారీగా పవన్ కల్యాణ్ రివ్యూ చేస్తున్నారు. 35 సెగ్మెంట్లకు సంబంధించిన రివ్యూ చేశారు. ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారు చేయాలని పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై పవన్ కల్యాణ్ నటుడు పృథ్వీ, జానీ మాస్టర్‌తో చర్చించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.