‘సూపర్ 6 లో 2 ఫిక్స్!
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:56 AM
‘జూన్ వచ్చింది... పోయింది! ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు’ అని ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త! ‘సూపర్ సిక్స్’లో కీలకమైన ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందనున్నాయి.
3 నెలల్లో తల్లికి వందనం మార్చి,
ఏప్రిల్‌లో అన్నదాతా సుఖీభవ
‘సూపర్ సిక్స్’లోని మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుడుతుండగా... ‘తల్లికి వందనం’ మరో మూడు నెలల్లో అమలు చేయనున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ నిధులు మార్చి, ఏప్రిల్‌లో రైతులకు అందనున్నాయి.
జనవరిలో తల్లుల ఖాతాల్లో నిధులు
ఎందరు పిల్లలున్నా ఒక్కరికే జగన్‘అమ్మ ఒడి’
నేడు అందరు పిల్లలకూ పథకం అమలు
నాడు రూ.2 వేలు కోత పెట్టి 13 వేలే పంపిణీ
నేడు విద్యార్థులందరికీ ఇస్తామని బాబు హామీ
తల్లికి వందనం కోసం 12 వేల కోట్లు అవసరం
‘అన్నదాతా సుఖీభవ’పై ఇప్పటికే కసరత్తు
పకడ్బందీ విధి విధానాలతో అమలు
ఆర్థిక కష్టాలు.. అడ్డగోలు అప్పులకు దూరం
అయినా కీలక పథకాల అమలుకు సై
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘జూన్ వచ్చింది... పోయింది! ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు’ అని ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త! ‘సూపర్ సిక్స్’లో కీలకమైన ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందనున్నాయి. పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లులందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ రూ.15వేల చొప్పున అందించనుంది. అలాగే... రైతులకు ఏటా రూ.20వేల చొప్పున లబ్ధి చేకూర్చే ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రారంభించనున్నారు. ‘చదువుకునే పిల్లలందరికీ... ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తాం!’... అని 2019 ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత... పిల్లలందరికీ కాదు, తల్లికి మాత్రమే అని చెప్పారు. 15వేలలో రూ.2వేలు కోత వేశారు. గతేడాది జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 83,15,341 మంది విద్యార్థులు ఉండగా... వారి తల్లులు 42.61లక్షల మందికి ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. దీనికి రూ.6394 కోట్లు ఖర్చయింది. విద్యార్థుల లెక్క కాకుండా తల్లుల లెక్కన ఇస్తేనే ఇంత భారం! ఇప్పుడు... విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది కూడా దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేసేందుకు దాదాపు 12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా!
రైతుకు భరోసా ఇలా...
రాష్ట్రంలో రైతన్నలకు సంవత్సరానికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఎన్డీయే కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ‘సూపర్ సిక్స్’లో దీనిని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం గత వంద రోజులుగా ’అన్నదాత-సుఖీభవ’ పథకం అమలుకు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ‘రైతు భరోసా’లో ఉన్న లోపాలను పరిహరించి, వాస్తవ సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, అటు భూ యజమానులకు, ఇటు కౌలు రైతులకు ఆసరా ఇచ్చేలా, ముఖ్యంగా సన్నచిన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందేలా పథకం రూప కల్పన జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి, మొత్తంగా ఏటా రూ.20వేలు ఇవ్వనున్నారు. పకడ్బందీగా విధివిధానాలు రూపొందించి... మార్చి, ఏప్రిల్ నెలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిధుల కటకట ఉన్నా...
జగన్ ఐదేళ్లు అమలు చేసిన అడ్డగోలు ఆర్థిక విధానాల కారణంగా ఖజానా ఖాళీ అయ్యింది. పైగా... కొండంత అప్పుల భారం మోయాల్సి వస్తోంది. పాత అప్పుల అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.70వేల కోట్లు కట్టాల్సిందే. ఏం చేసినా, చేయకున్నా... పథకాలు అమలు చేసినా, చేయకపోయినా దీనికి మాత్రం మినహాయింపు ఉండదు. జగన్‌లాగా అడ్డగోలు అప్పులు చేస్తే తప్ప భారీగా సొమ్ములు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి కేంద్రం అనుమతించిన అప్పులు మాత్రమే చేస్తున్నారు. జగన్ సర్కారులో చేసినట్లుగా... కార్పొరేషన్ల ఆదాయాలు తాకట్టు పెట్టడం, ప్రభుత్వ ఆస్తులు విక్రయించడం వంటి అక్రమ విధానాల్లో అప్పులు తేవడం లేదు. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలకు నిధులు సమకూర్చడం ఇబ్బందిగా మారింది. చంద్రబాబు సారథ్యంలో జూన్‌లో కూటమి సర్కారు ఏర్పడింది. అప్పటినుంచి పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడంలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. వరుస సమీక్షలతో ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఈలోపు... వరదలు, సహాయ, పునరావాస చర్యలకే నెల గడిచిపోయింది. ఈ కారణంగా పథకాల అమలులో జాప్యం చోటుచేసుకుందని చెప్తున్నారు. మరోవైపు... జగన్ 2019 మేలో అధికారం చేపట్టి... 2020 జనవరిలో ‘అమ్మ ఒడి’ అమలు మొదలుపెట్టారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

నాడు కొందరికే భరోసా..
రైతులకు సాయం అందిస్తామని హామీ ఇచ్చి 2019మే చివరిలో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆరు నెలలకుగానీ రైతు భరోసాను ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ ముగిశాక మొదటి విడత పెట్టుబడి సాయాన్ని 2019 అక్టోబరు15న ప్రారంభించారు. రైతు భరోసా కింద ఏటా రూ.12,500 ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రూ.13,500 ఇస్తామని ప్రకటించారు. కానీ... అప్పటికే కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని అనుసంధానం చేసి, కేంద్రం ఏటా ఇస్తున్న రూ.6వేలతో కలిపి, మొత్తంగా రూ.13,500 ఏడాదిలో మూడు కిస్తీలుగా చెల్లించారు. దీనికీ సవాలక్ష ఆంక్షలు ఉండేవి. కేవలం భూ యజమానులకే పెట్టుబడి సాయం అందించారు.
జగన్ ‘కోతలు’
గత ప్రభుత్వం ఒక్కో తల్లికి రూ.15వేలు అని ప్రచారం చేసినా... వాస్తవంగా ఇచ్చింది రూ.13వేలు మాత్రమే. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధి కింద రూ.వెయ్యి, పాఠశాలల నిర్వహణ నిధి కింద మరో రూ.వెయ్యి కోత పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కోతలను ఏం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వం రెండు వేలు కోత పెట్టినందున మొత్తంగా ఒక రూ.వెయ్యి మినహాయించుకుని ఇద్దామా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
వైసీపీ విన్యాసాలు...
అమ్మఒడి పథకం అమలుపై వైసీపీ ప్రభుత్వం అనేక విన్యాసాలు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని అమలుచేయకుండా కోతలు పెట్టడంతో పాటు తేదీలు నచ్చినట్టు మార్చుకుని ఒక ఏడాది ఈ పథకాన్ని ఎగరగొట్టింది. 2019 మేలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆ వెంటనే విద్యా సంవత్సరం ప్రారంభమైనా అప్పుడు నగదు విడుదల చేయలేదు. జనవరిలో సంక్రాంతి సమయంలో మొదటి ఏడాది అమ్మఒడి నగదు విడుదల చేసింది. అలా రెండేళ్లు సంక్రాంతికి అమ్మఒడి ఇచ్చింది. ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఇస్తామంటూ... నగదు విడుదల సమయాన్ని జూన్‌కు మార్చింది. దీంతో ఒకేసారి ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఆ ఫలితంగా ఐదేళ్లలో నాలుగుసార్లే అమ్మఒడి పథకం నగదు తల్లులకు అందింది.
ఇది కూడా చదవండి:
వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా!