CM Chandrababu: లడాఖ్ మృతులకు సీఎం చంద్రబాబు నివాళి
ABN , Publish Date - Jul 01 , 2024 | 07:33 PM
లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
అమరావతి: లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సైనికుల మృతి తనను కలచివేసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో సైనికులు ప్రాణాలు కోల్పోయారని.. దేశం కోసం రక్తం చిందించారని వివరించారు. సైనికుల మృతిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
లడఖ్ వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురైంది. దీంతో ఐదుగురు సైనికులు మరణించారు. వీరిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు. T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. నదిని దాటే ట్యాంక్ విన్యాసాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.