CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:05 PM
రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53, 748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
అమరావతి: రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. రాజధాని కోసం 53, 748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
మోసం చేసిన జగన్
గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు వివరించారు. ’రాజధాని మధ్యన ఉండాలి అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్, తరువాత క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం వుండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ లివేబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్ట్ 51,687 కోట్లు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి సీఎం జగన్ వెంటనే ప్రజావేదికను కూల్చి వేశాడు. అటు నుంచి మూడు రాజధానులు అన్నారు. బిసిజి రిపోర్ట్, జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని’ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Read Also: YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం
అవమానాలకు గురయ్యారు..
‘అమరావతి రైతులు ఎన్నో అవమానాలకు గురయ్యారు. కొద్దిరోజుల తర్వాత రోడ్డుమీదకు వచ్చారు. ఆ రైతులు తిరుపతి వెళితే కళ్యాణ మండపం ఇవ్వలేదు. శ్రీకాకుళం వెళితే మధ్యలో అడ్డగించి పంపారు. అమరావతి నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ల్యాండ్ అక్వైజేషన్ నోటిఫికేషన్ రద్దు చేశారు. దాంతో 122 మందికి నమ్మకం పోయింది. వర్క్ స్టార్ట్ చేయలేదు. 14 ఎకరాల్లో 12 టవర్లలో నిర్మిస్తోన్న హ్యాపీ నెస్ట్‌లో 1420 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. ప్రాజెక్టు కాస్ట్ పెరిగి రూ.160 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. పూర్తి కాని బిల్డింగులు చాలా ఉన్నాయి అని’ సీఎం చంద్రబాబు వివరించారు.
పడిపోయిన రేటింగ్
‘గత ప్రభుత్వ చర్యలతో అమరావతి క్రెడిట్ రేటింగ్ పడిపోయింది. క్రెడబిలిటీ పోయింది. ఇక్కడ ఉన్న కొందరు హైదారాబాద్, ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. అమరావతి బాండ్ల రేటింగ్ కూడా పడిపోయింది. 2019 ముందు నిర్మాణం, 2019 తరువాత పరిస్థితిపై క్లిప్పింగ్స్‌ను సీఎం చంద్రబాబు చూపించారు. ఒకోసారి ఇవి తలచుకుంటే ఆవేదన కలుగుతుంది. నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే.. నాకు అవకాశం వచ్చింది. ఈ రోజు సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడాలి. పెట్టుబడి దారులతో మాట్లాడాలి. పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్న భూతాన్ని చూసి భయపడుతున్నారు. చివరికి అమరావతిలో రహదారులను తవ్వుకు పోయారు అని’ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం
వీడియోల ప్రదర్శన
‘అమరావతి భవనాలు నాడు నేడు అని సీఎం చంద్రబాబు వీడియోలు ప్రదర్శించారు. ఒక వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాడు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తూర్పున ఉన్న సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తిరిగి ఎక్కడ ప్రారంభించాలి.. పెట్టుబడి దారుల్లో ఎలా నమ్మకం కలిగించాలి. అందుకే ప్రజా రాజధాని అమరావతి. ఏపీ గర్వపడేలా అమరావతి ఉండాలి. డెవలప్ అమరావతి గ్రో ఏపీ మా నినాదం. ఈ విధ్వంసం వల్ల ఎంత లాస్ అనేది చెప్పలేం. 50 వేల కోట్లు ఖర్చు పెడితే రీ సైకిల్ కింద 20 నుండి 30 వెల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. 8 వేల ఎకరాలు ఎకరా 20 కోట్లు చేసి ఉంటే లక్ష 60 వేల కోట్లు ఆస్తి అది. దేశంలో టాప్ 10 యూనివర్సిటీ, హాస్పిటల్, స్కూల్స్ రావాలి. ఎస్ఆర్ఎంలో 20 వేలమంది చదువుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళేప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. దుష్టశక్తుల దిష్టి నుంచి అమరావతిని కాపాడుకోలేక పోయాం. రైతుల పట్ల దారుణం గా వ్యవహరించారు. కోర్టులకు రైతులు భారీగా ఖర్చు చేశారు. మెంటల్ ఫెలో తప్ప ఎవరూ ఇలా చేయలేదు. అమరావతినిమరొకరు వచ్చి మార్చ కుండా ఏమి చేయాలి అని చూస్తున్నాం. అమరావతికి ఉన్న న్యాయపర చిక్కులు పరిస్కరిస్తాం. త్యాగం చేసిన రైతులుపై పెట్టిన కేసులు తొలగిస్తాం . వరల్డ్ బెస్ట్ టాప్ సిటీలతో టై అప్ చేసుకుంటాం. ఆర్ 5 జోన్ పై లీగల్‌గా ముందుకెళతాం. 130 మంది గవర్నమెంట్ సంస్థలు వస్తాం అన్నాయి కేవలం 5 మాత్రమే వచ్చాయి. నాలుగో సారి సీఎంగా ఇలాంటి లేగసి ఎన్నడూ చూడలేదు అని’ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఏం చేస్తారోనని భయం
‘ఆ దుర్మార్గుడు (జగన్) ఏం చేస్తారోనని భయపడుతున్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. వాళ్ళలో మనం నమ్మకం కలిగించాలి. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండేందుకు అర్హుడా? ప్రజలు ఆలోచించాలి. బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్ళీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలి. ప్రజా రాజధాని అమరావతి నాది అనే ముందుకు వెళ్ళాలి. డెవలప్ అమరావతి.. గ్రో ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలనతో ప్రజా రాజధాని అమరావతి ముందుకు సాగాలి. ఇందులో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పెరిగిన ధరలు ప్రకారం అమ్ముకుంటే ఎంతో ఆదాయం వస్తుంది అని’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Congress: రాజ్యసభ నుంచి వాకౌట్‌పై ఖర్గే స్పష్టత..
Read Latest AP News AND Telugu News