CM Jagan: పంచాంగ శ్రవణానికి దూరంగా సీఎం జగన్.. అసలు కారణంపై అనుమానాలు..!
ABN , Publish Date - Apr 10 , 2024 | 07:27 PM
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఇక రాజకీయ పార్టీలు అయితే పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగ శ్రవణం నిర్వహించడం ఓ అలవాటుగా వస్తోంది. కాని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఇక రాజకీయ పార్టీలు అయితే పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగ శ్రవణం నిర్వహించడం ఓ అలవాటుగా వస్తోంది. కాని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఇరత పార్టీల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా పంచాగ శ్రవణంలో పాల్గొంటారని పార్టీ కార్యకర్తలంతా భావించారు. ఈ కార్యక్రమం కోసం భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. కాని కేవలం పూజతో సరిపెట్టి, వేద ఆశీర్వచనాలతో సరిపెట్టేశారు. మొత్తం కార్యక్రమాన్ని అరగంటలోపే ముగించేశారు. దీంతో పంచాంగ శ్రవణం ఉంటుందని ఆశగా వచ్చిన కార్యకర్తలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చిందట.
Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..
కారణం ఏమిటి..?
సీఎం జగన్ జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే ఉగాది రోజున వేడుకలను పూజా కార్యక్రమంతో సరిపెట్టి, విశ్రాంతి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జ్వరంతో బాధపడుతుంటే ఉగాది తర్వాత రోజు అంటే బుధవారం మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆరోగ్యం బాలేని వ్యక్తి వెంటనే ప్రచారంలో ఎలా పాల్గొ్న్నారనే ప్రశ్నలు మరోవైపు తలెత్తుతున్నాయి. వాస్తవానికి పల్నాడు జిల్లాలో ఉగాది వేడుకలు ఉంటాయని, పంచాంగ శ్రవణం ఉంటుందని పార్టీవర్గాలు ప్రకటించాయి. దీంతో పంచాంగ శ్రవణం ఉంటుందని కార్యకర్తలు భారీఎత్తున తరలివచ్చారు.
సోమవారం రాత్రి వినుకొండ నుంచి రోడ్‌షోగా వచ్చిన జగన్ శావల్యాపురం మండలం గంటావారిపాలెం విడిది కేంద్రంలో బస చేశారు. మంగళవారం ఉగాది కావడంతో వేడుకలు ఏమైనా ఉంటాయేమోనని పార్టీ నేతలు కొందరు రాగా వారిని భద్రతా సిబ్బంది పంపించేశారు. అయితే ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ విడిది కేంద్రంలోకి వెళ్లారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తరవాత వారికి ఉగాది పచ్చడి ఇచ్చి ఉగాది వేడుక ముగించారు. సీఎం పంచాగ శ్రవణానికి ఎందుకు దూరంగా ఉన్నారనేదానిపై సీఎంవో వర్గాలు కాని, పార్టీ నేతలు కాని స్పష్టత ఇవ్వలేదు. దీంతో సీఎం ఉగాది వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..