MVV Satyanarayana: ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jun 25 , 2024 | 09:42 PM
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది.
అమరావతి: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు చేసింది. కేసును కొట్టేయాలని హైకోర్టులో ఎంవీవీ సత్యనారాయణ క్వాష్ పిటిషన్ వేశారు.
కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టువాయిదా వేసింది.
కాగా.. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని, విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న ఆయనపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోపక్క, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు