Share News

Chandrababu: భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:48 AM

అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Chandrababu: భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

అమరావతి: రెండవ సారి టీ20 (T20) ప్రపంచకప్ (World Cup) గెలుచుకుని విశ్వ విజేతగా (World Champion) నిలిచిన భారత జట్టుకు (Team India) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ టీం (Team India) చరిత్ర సృష్టించిందని, భారత జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత టి20 వరల్డ్ కప్పు భారత్ సాధించిందని, ఈ విజయం భారత ప్రజలను సంతోషం, ఆనందాన్ని పంచిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


రోహిత్ సేన చరిత్ర సృష్టించింది: మంత్రి లోకేష్..

భారత క్రికెట్ జట్టు ఈరోజు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందని మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. రోహిత్ సేన చరిత్ర సృష్టించిందని, తీవ్రమైన ఒత్తిడిలో కూడా సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను గెలిపించిందన్నారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.


సమిష్టి కృష్టితో భారత్ విజయం: జగన్

టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైయస్ఆర్ సీపీ అధినేత జగన్మోన్ రెడ్డి (Ex CM Jagan) ఎస్ వేదికగా అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందని, కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతంచేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరట ఇచ్చిందన్నారు. బీసీసీఐ కెప్టెన్‌గా తెలుగువాడు కావడం గర్వకారాణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్‌ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించారని, రానున్న రోజుల్లో టీం ఇండియా మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.


కాగా ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 2007 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీని కైవసం చేసుకున్నట్టయ్యింది. అలాగే 2011 తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకిదే తొలి వరల్డ్‌కప్‌. అటు మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా విజయం అంచులవరకు వచ్చినా చివర్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47), శివమ్‌ దూబే (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) రాణించారు. కేశవ్‌, నోకియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), స్టబ్స్‌ (31), డికాక్‌ (39), మిల్లర్‌ (21) రాణించారు. హార్దిక్‌కు మూడు.. బుమ్రా, అర్ష్‌దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బుమ్రా నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

జగన్‌ కక్షకు బందరు పోర్టు బలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 30 , 2024 | 08:51 AM