CM Jagan: గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:52 AM
గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది.
గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ (Siddam) బస్సుయాత్ర (Bus Yatra) శుక్రవారం గుంటూరు జిల్లా (Guntur Dist.)లో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం (Sattenapally Constituency), దూళిపాళ్ల (Dulipalla)నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు (Medikonduru), గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది. ఏటూకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ అనంతరం సీఎం జగన్ నంబూరులో రాత్రికి బస చేస్తారు.
జగన్ బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి ప్రారంభవుతుంది. రంజాన్ సందర్భంగా నిన్న (గురువారం) ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. 12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు
ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా యాత్ర సాగుతుంది. రాత్రికి నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్నారు.