Share News

kidney Racket Case: పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 10:56 AM

గుంటూరు జిల్లా: ఇటీవల గుంటూరులో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుంటూరుకు చెందిన వ్యక్తికి రూ. 30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి మోసం చేశారు.

kidney Racket Case: పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

గుంటూరు జిల్లా: ఇటీవల గుంటూరు (Guntur)లో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసు (kidney Racket Case)లో పోలీసులు (Police) దర్యాప్తు వేగవంతం చేశారు. గుంటూరుకు చెందిన వ్యక్తికి రూ. 30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి మోసం చేశారు. ఈ వ్యవహారంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంలను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మధుబాబు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి


విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి బాధితుడు గుంటూరుకు చెందిన వ్యక్తి కావడంతో తనకు జరిగిన అన్యాయం, కిడ్నీ దోపిడీపై మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో భాష అనే వ్యక్తి కిడ్నీ అమ్మకానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహించాడు. కిడ్నీ సేకరించిన వ్యక్తి బంధువు సుబ్రహ్మణ్యం.. మరో వ్యక్తి వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ నుంచి అతను పారిపోయినట్లు సమాచారం. బాధితుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్‌పై కూడా కేసు నమోదైంది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.


ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మధుబాబు అనే యువకుడికి విజయవాడకు చెందిన బాషా సోషల్‌ మీడియాలో పరిచయమయ్యా డు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికి ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నా రు. ఆపరేషన్‌ తర్వాత కేవలం లక్ష రూపాయలు ఇచ్చారు. మిగిలిన డబ్బు అడిగేసరికి స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశావని, మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బాషా బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఇలాంటివి చాలా చేశారు..

జీపీఎస్ జీవోకు బ్రేక్..

జగన్‌ చీకటి దందాలో మరో కొత్త కోణం..

పార్టీ మారనున్న మరో బీఆర్ఎస్ నేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 11:03 AM