Share News

Minister Nara Lokesh: పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు జగన్.. మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:50 PM

ఇంట్లో బాబాయ్‌ని చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ లో జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Minister Nara Lokesh: పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు జగన్.. మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు

అమరావతి: ఇంట్లో బాబాయ్‌ని(మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి) చంపేసి.. పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పునాదులే నేరాలు- ఘోరాలు అని ఆయన కుటుంబ సభ్యులే చెప్పారని విమర్శించారు జగన్ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా ఎందుకు చేయలేదని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.


జగన్ హయాంలో ఊరికో ఉన్మాది..

‘‘లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్.. మా ఖర్మ..ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్‌ని ఏపీ మొత్తం వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బతికే లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేసినా కాపాడావ్. అనంతబాబు లాంటి వ్యక్తి దళితులను చంపితే, ఇంటికి పిలిచి భోజనం పెట్టావ్. మహిళలను వేధించిన వారిని అందలం ఎక్కించావ్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారికి టికెట్లు ఇచ్చావ్. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా ’’ అని మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


యథావిధిగా నారా లోకేష్ ట్వీట్

1. నీ ఐదేళ్ల పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గుర‌య్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. ఏ నాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శ చేశావా ? కనీసం ఒక్కసారైనా ఖండించావా ? ఒక్కసారైనా సమీక్ష చేశావా ?

2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ ? ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి.

3. నీ పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీల‌పై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీల‌పైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన ఏపీలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీం అనే వ్యక్తిని నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా జగన్ ?

4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేస్తున్నావ్. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ త‌ర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బతుకు జగన్ ?

5. ఏపీలో జరిగే ప్రతి నేరానికి, నువ్వు పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా నీ పాలన సాగింది. ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేశావా ? మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.


6. 2014-19 మధ్య రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు పెడితే, నువ్వు రాగానే వాటిని మూలన పడేసింది నిజం కాదా ? ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? ఇవన్నీ నువ్వు , నీ పార్టీలో ఉండే క్రిమినల్స్ దొరక్కుండా ఉండటానికి, నువ్వు వేసిన ప్లాన్ కాదా ?

7. కూటమి ప్రభుత్వం రాగానే, ఐదేళ్ల పాటు నువ్వు సమాజంలో నాటిన విష భీజాలు పీకి పడేసే పనిలో ఉంది. 120 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకువచ్చాం. గంజాయిపై ముందు దృష్టి పెట్టాం. గంజాయి మత్తులో జరుగుతున్న క్రైమ్స్‌పై ఉక్కు పాదం మోపుతున్నాం. ఏ ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నాం. కేసు తీవ్రతను బట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో నీ లాంటి సైకోలు, ఊరికో సైకోని తయారు చేశాడు. ఈ సైకోలని కంట్రోల్‌లో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే చర్యలు ఉంటున్నాయి. నీ లాగా నిద్ర పోవటం లేదు

8. సీమలో నువ్వు, నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్ష‌నిజం అణిచివేసిన చరిత్ర చంద్రబాబు గారిది. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్ట్ చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. నువ్వు, నీ కుటుంబం రౌడీలను పెంచి పోషిస్తే, రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్ పెట్టి శిక్షించింది చంద్రబాబు గారు. మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు గారు. తీవ్రవాదంపై పోరాడింది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా గత ఐదేళ్లు నువ్వు పెంచి పోషించిన సైకోలను, ఏపీ నుంచి తరిమి కొట్టి, సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబు గారే.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు

Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..

AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..

For more AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 09:48 PM