YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..
ABN , Publish Date - Mar 04 , 2024 | 07:59 AM
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది.
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (AP State) అసెంబ్లీకి (Assembly) త్వరలోనే ఎన్నికలు (Elections) జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ (YCP) గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు (Voters) భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నరసరావుపేటలో వాలంటీర్ల సమావేశం పెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి (MLA Gopi Reddy) ఒక్కో వాలంటీర్‌కు (Volunteer) ఐదు వేలు చొప్పున పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికలలో తనను గెలుపించే బాధ్యత మీదేనంటూ వాలంటీర్లను వేడుకున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్రావు ప్రజలకు ఎన్నికల తాయిలాలు పంపిణీ చేశారు. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు రైస్ కుక్కర్‌లు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి కుక్కర్‌లు పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే వాలంటీర్లకు కూడా భారీ ఆఫర్ల ఆశ చూపెట్టారు.