Share News

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:19 AM

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

అమరావతి: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (RaghuramaKrishnam Raju) కేసు (Case)లో ట్విస్ట్ (Twist) నెలకొంది. ఆయన కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రకాశం (Prakasam) ఎస్పీ దామోదర్‌కు (SP Damodar) దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ పోలీసులు కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.


కాగా ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌కు హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా పోలీసులు ఇటీవల విజయ పాల్‌ను విచారణకు పిలిపించారు. అయితే విజయ పాల్‌ను విచరించడంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టు బెయిల్ తిరస్కరించినా విజయ పాల్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపణలు వచ్చాయి. అందుకే దర్యాప్తు అధికారిని ప్రభుత్వం మార్చింది.

అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించిన కేసు (Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ (Vijay Paul)కు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును.. సీఐడీ కస్టడీలో విజయ్‌పాల్‌ చిత్రహింసలు పెట్టారు.


తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్‌పాల్ తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా, పీపీ లక్ష్మీనారాయణ,.. రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితి ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించనున్న ఈడీ

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు..

గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు

రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 14 , 2024 | 11:27 AM