AP Politics: యాక్షన్ స్టార్ట్.. జగన్‍కు నిద్ర పట్టడం లేదా..
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:59 PM
ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..
సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారాలు, వ్యక్తుల వ్యక్తిగత అంశాలపై పోస్టులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించినప్పటినుంచి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‍కు నిద్ర పట్టడంలేదనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మీడియా ముందుకు వచ్చి పోలీసు అధికారులనుద్దేశించి అమర్యాదగా మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ శ్రేణులు, వైసీపీ అభిమానులు తప్పుడు పోస్టులతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినా, కొందరు వ్యక్తుల వ్యక్తిగత అంశాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండాలనేది జగన్ ఉద్దేశమా అంటూ కొందరు బహిరంగంగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీలు, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు, రాజకీయంగా విమర్శించేవారిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా, పార్టీ అభిమానులు తమ ఇష్టారాజ్యంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే నిందితుపై చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించే ప్రయత్నం అప్పటి సీఎంగా ఉన్న జగన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విపక్షంలో ఉండి కూడా జగన్ అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ
నిద్ర పట్టడం లేదా..
విపక్ష పార్టీ నాయకుడిగా, బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని చెప్పాల్సిన వ్యక్తి.. ఎందుకు చర్యలు తీసుకుంటారు, యాక్షన్ స్టార్ట్ చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారనేది ప్రజలకు అర్థం కావడంలేదట. ఫేక్ పోస్టులు పెట్టొద్దని, ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పోస్టులు పెట్టవద్దని, కేవలం రాజకీయంగా విమర్శించాలని పార్టీ శ్రేణులకు చెప్పాల్సిన జగన్, తప్పుచేసే వ్యక్తులపై చర్యలకు పాల్పడితే అధికారులను గుర్తు పెట్టుకుంటానని వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు
జగన్ పనైపోయిందా..!
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంతో పాటు, అరాచకాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పాటు, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమని చెప్పడంతో ఇప్పటివరకు జగన్ అండ్ కో చెప్పినట్లు చేసిన క్యాడర్ కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటివరకు ఫేక్ ప్రచారంతో కాలం గడుపుతూ వచ్చిన తమ పార్టీ పరిస్థితి ఏమవుతుందోనంటూ జగన్ ఆందోళన చెందుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తప్పులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సహకరిస్తారా.. లేదంటే నిందితులకు అండగా ఉంటూ తన అరాచక బుద్ధిని కొనసాగిస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here