AP News అంబటి ఆఫీసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:12 PM
Andhrapradesh: గుంటూరు జిల్లా సబ్ జైలులో నిన్న(మంగళవారం) వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నకిరేకల్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని.. దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు. ఈ క్రమంలోనే
పల్నాడు, నవంబర్ 13: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా నకరేకల్కు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) ఆఫీసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపైన, ప్రభుత్వ పెద్దలపైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను పోలీసులు రోజుకో చోట అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ
నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నకిరేకల్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని.. దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ అంబటి తీరును ఆ పార్టీ కార్యకర్తలే తప్పుబడుతున్న పరిస్థితి. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అలాగే గతంలో జడ్జిలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల విషయంలో ఇప్పటికే పలువురిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మున్ముందు మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వారి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతీ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
YS Sunitha: సైకోల అంతు చూసేందుకు పులివెందులలో వైఎస్ సునీత..
రాంగోపాల్ వర్మకు నోటీసులు
మరోవైపు సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు మద్దిపాడు పోలీసులు.. హైదరాబాద్‌కు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టాడని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశారని ఫిర్యాదు నమోదు అయ్యింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితమే రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.
ఇవి కూడా చదవండి...
TEA: బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..
KTR: పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
Read latest AP News And Telugu News